Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: ఛాలెంజింగ్ పాత్రలు చేయడమే ఇష్టం.. కొండపొలం నాకు పెద్ద సవాలు.. ఓబులమ్మ ముచ్చట్లు..

మెగా హీరో వైష్ణవ్ తేజ్.. రకుల్ ప్రీత్ జంటగా నటించిన చిత్రం కొండపొలం. ఈ సినిమాకు క్రిష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Rakul Preet Singh: ఛాలెంజింగ్ పాత్రలు చేయడమే ఇష్టం.. కొండపొలం నాకు పెద్ద సవాలు.. ఓబులమ్మ ముచ్చట్లు..
Rakul
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 07, 2021 | 12:16 PM

మెగా హీరో వైష్ణవ్ తేజ్.. రకుల్ ప్రీత్ జంటగా నటించిన చిత్రం కొండపొలం. ఈ సినిమాకు క్రిష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‎టైన్మెంట్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్ననాయి. ఈ చిత్రాన్ని రేపు (అక్టోబర్ 8న) థియేటర్లలో విడుదల చేయనున్నారు.. ఈ క్రమంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొండపొలం సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగక రకుల్ మాట్లాడుతూ.. ఫలానా పాత్రలు.. సినిమాలు చేయాలని లక్ష్యాలు ఏం లేవు. ఒక్క సినిమా చేసిన జీవితాంతం ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటాను. దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే, బాహుబలి సినిమాల మాదిరిగానే కొండపొలం మూవీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది అనుకుంటా. ప్రస్తుతం బాలీవుడ్ లో అటాక్, మేడే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ సినిమాలు చేస్తున్నాను. వచ్చే ఏడాది నావి ఆరు సినిమాలు విడుదల కానున్నాయి. నేను కరణం మళ్లీశ్వరి బయోపిక్ చేయడం లేదు. కొండపొలంలో ఓబులమ్మ పాత్ర నాకు చాలా ప్రత్యేకం. నేను గతంలో చేసిన చిత్రాలకు కొండపొలం సినిమా పూర్తిగా విభిన్నం. నేను ఇందులో గొర్రెలు కాసే అమ్మయిగా కనిపిస్తాను. నా లుక్, భాష, యాస అన్ని విభిన్నంగా ఉంటాయి. ఈ సినిమా కోసం వైష్ణవ్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. తన కళ్లు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. వైష్ణవ్ కు మంచి భవిష్యత్తు ఉంది. అంతా పెద్ద కుటుంబం నుంచి వచ్చినా.. ఓవర్ కాన్ఫిడెంట్ అస్సలు లేదు. చాలా ఒదిగి ఉంటాడు.. తనలో నేర్చుకోవాలనే తపన ఉంది అంటూ చెప్పుకొచ్చింది రకుల్.

కొండపొలం షూటింగ్ వికారాబాద్ అడవులలో జరిగింది. అడవిలో షూటింగ్ చాలా కష్టం. ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్ లోనే పూర్తి చేశాం. ఇదంతా క్రిష్ ఆలోచన విధానం వల్లే సాధ్యమైంది. ఎప్పుడైనా వర్షం పడితే.. అప్పటికప్పుడు వర్షంలో సీన్స్ తెరకెక్కించేవారు. ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటి సినిమా రాలేదు. ఇది మినీ జంగిల్ బుక్ సినిమా అన్నమాట. పాటలు, కొన్ని సన్నివేశాలకు పరిమితమయ్యే పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఏ పాత్ర అయినా సరే.. నాకు ఛాలెంజింగ్ అనిపిస్తే చేస్తా.. కొండపొలంలోని ఓబులమ్మ పాత్ర నాకులాగే సవాల్‏గా సవాలుగా అనిపించింది. అందుకే క్రిష్ కథ చెప్పగానే చేస్తానని చెప్పాను. హిందీలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నావు అంటున్నారు. కానీ కథ నచ్చితే ఎక్కడైనా సినిమాలు చేస్తాను. ఓటీటీలో అద్భుతమైన కంటెంట్ వస్తుంది. మంచి వైవిధ్యభరితమైన కథ దొరికితే ఓటీటీలోనూ నటిస్తాను. ప్రస్తుతం ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఇలాంటి కథలు దొరకడం లేదు అని రకుల్ చెప్పుకొచ్చారు.

Also Read: MAA Elections: మా ఎన్నికలపై బెట్టింగ్‌లతో పాటు బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయం షురూ..

Samantha: ఆ తీపి జ్ఞాపకాలలో ఒంటరిగా ఇలా.. విడాకుల తర్వాత పెళ్లిరోజున సింగిల్ ఫోటో షేర్ చేసిన సమంత..