AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: కోడలంటే ఇలా ఉండాలి! తమ్ముడి పెళ్లిలో తన అత్తమ్మ కోసం ప్రియాంక ఏం చేసిందో తెలుసా? వీడియో

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి తెలుగు ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎమ్ బీ 29 (వర్కింగ్ టైటిల్) సినిమాలో ప్రియాంక హీరోయిన్ గా నటించనుంది.

Priyanka Chopra: కోడలంటే ఇలా ఉండాలి! తమ్ముడి పెళ్లిలో తన అత్తమ్మ కోసం ప్రియాంక ఏం చేసిందో తెలుసా? వీడియో
Actress Priyanka
Basha Shek
|

Updated on: Feb 08, 2025 | 10:37 AM

Share

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. ఇప్పుడు హాలీవుడ్‌లో కూడా ఈ ముద్దుగుమ్మ పేరు మార్మోగిపోతోంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆమెకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం తన భర్త నిక్ జొనాస్ తో కలిసి అమెరికాలోనే ఉంటోంది ప్రియాంక. గతంలో లాగా బాలీవుడ్ లోనూ ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. అయితే తరచూ భారత్ కు వస్తుంటుందీ అందాల తార. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తన బంధువులతో కలిసి వేడుక చేసుకుంటుంది. కాగా ప్రియాంక ప్రస్తుతం తన సోదరుడు సిద్ధార్ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటోంది. ఈ వేడుక కోసం గత కొన్ని నెలలుగా భారత్ లోనే ఉంటోందీ గ్లోబల్ బ్యూటీ. ఈ క్రమంలో ప్రియాంక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

కాగా ప్రియాంక హాలీవుడ్‌లో పనిచేస్తున్నప్పటికీ, ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నప్పటికీ భారతీయ సంప్రదాయాలకు బాగా ప్రాధాన్యమిస్తుంది. తాజాగా ఆమె సిద్ధార్థ్ చోప్రా ప్రీ-వెడ్డింగ్ వేడుకకు అద్భుతమైన స్ట్రాప్‌లెస్ గౌను ధరించి వచ్చింది. ఈ వేడుకలో ప్రియాంక అత్తమామలు కూడా ఆమెతో కనిపించారు. ఫొటోలకు పోజులిచ్చేటప్పుడు కూడా ప్రియాంక తన అత్తమామలను మర్చిపోలేదు. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఫోటోలు దిగింది. అదే సమయంలో ప్రియాంక తన అత్తగారి కోసం చేసిన ఒక పని అందరి మన్ననలు అందుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ప్రియాంకను ప్రశంసలతో ముంచెత్తారు.

ఇవి కూడా చదవండి

తమ్ముడి పెళ్లిలో ప్రియాంక చోప్రా..

ప్రియాంక సోదరుడి సంగీత్ ఫంక్షన్ కి ప్రియాంక నిక్ జోనాస్ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక అత్తగారు డెనిస్ జోనాస్ గులాబీ రంగు చీరలో కనిపించగా, కెవిన్ జోనాస్ సీనియర్ కూడా భారతీయ దుస్తులను ధరించారు. ప్రియాంక తన అత్తమామలతో కలిసి ఫొటోలు దిగింది. ఇదే సందర్భంలో ఆమె తన అత్తగారి చీరను సరిచేస్తూ కూడా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. ప్రియాంక తన అత్తమామలను ఎంత బాగా చూసుకుంటుందో చెప్పడానికి ఈ వీడియో నిదర్శనమంటూ అభిమానులు, నెటిజన్లు గ్లోబల్ బ్యూటీని ప్రశంసిస్తున్నారు.

భర్త నిక్ జొనాస్ తో ప్రియాంక..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!