- Telugu News Photo Gallery Cinema photos Amitabh Bachchan is getting ready for another sensational role in Telugu after Kalki 2898 AD
Amitabh Bachchan: కల్కి తర్వాత మరో తెలుగు సినిమాలో బిగ్ బి.. అమితాబ్ కోసం డిఫరెంట్ క్యారెక్టర్ డిజైన్..
నేనూ మీ వాన్నే.. తెలుగు నటుడినే.. నన్ను కూడా పట్టించుకోండి కాస్త..! ఈ మాటలు అన్నదెవరో కాదు ఇండియన్ సినిమా లెజెండ్... ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అమితాబ్ బచ్చన్. ANR అవార్డ్స్ వేదికపై ఆయన అన్న మాటల్ని బాగానే గుర్తు పెట్టుకున్నారు మన దర్శకులు. కల్కి తర్వాత తాజాగా మరో సెన్సేషనల్ రోల్‌కు రెడీ అవుతున్నారు బిగ్ బి. మరి అదేంటి..?
Updated on: Feb 08, 2025 | 10:25 AM

అమితాబ్ బచ్చన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరమా చెప్పండి..? ఆయన పేరే ఓ బ్రాండ్..! కొన్నేళ్ళ కింది వరకు కేవలం హిందీలోనే నటించిన అమితాబ్ జీ.. ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఓకే అంటున్నారు. మరీ ముఖ్యంగా తెలుగుపై ఒకింత ఎక్కువ ప్రేమనే చూపిస్తున్నారు.

పైగా బిగ్ బి ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి కూడా. మనం సినిమాలో కొన్ని సెకన్లు కనిపించిన బిగ్ బి.. సైరాలో మాత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసై వెంకన్నగా నటించి మెప్పించారు.

ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కిలో అశ్వద్ధామగా అదరగొట్టారీయన. ఇందులో బిగ్ బి నటనకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అశ్వద్ధామ అంటే ఆయనే గుర్తువచ్చేలా పెర్ఫార్మెన్స్ చేసారు.

2024లో జరిగిన ఏఎన్నార్ అవార్డుల వేడుకలో నేనూ తెలుగు నటుడినే.. నన్ను కూడా గుర్తు పెట్టుకోండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. బిగ్ బి చెప్పినట్లుగా.. ఆయనలోని నటుడిని మన దర్శకులే ఎక్కువగా వాడుకుంటున్నారు.. గౌరవిస్తున్నారు కూడా.

తాజాగా విజయ్ దేవరకొండ, రాహుల్ సంక్రీత్యన్ సినిమాలో కీలక పాత్ర కోసం అమితాబ్ పేరు వినిపిస్తుంది. 1850ల నాటి కథ ఇది.. ఇందులో బిగ్ బి కోసం డిఫరెంట్ క్యారెక్టర్ రాహుల్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి మెల్లమెల్లగా మన వాడైపోతున్నారు బాలీవుడ్ మెగాస్టార్.




