“ఆ స్టార్ హీరోయిన్ నాకు దగ్గర బంధువు.. కానీ”.. అసలు విషయం చెప్పిన ప్రియమణి
తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీలోనూ అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే అక్కడ షారుఖ్ ఖాన్ హీరోనా నటించిన జవాన్ సినిమాతో మెప్పించింది. అయితే సినిమా ఇండస్ట్రీకి ఈ బ్యూటీకి ఓ దగ్గర బంధువు ఉంది. ఆమె కూడా ఓ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.? ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ నటి విద్య బాలన్.
2003లో అతగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా ప్లాప్ కావడంతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత జగపతి బాబు నటించిన పెళ్లైన కొత్తలో సినిమాతో హిట్ అందుకోవడంతోపాటు మంది గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తమిళ చిత్రం పరుత్తివీరన్‌లో కార్తీ సరసన కథానాయికగా నటించింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ప్రియమణికి జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసింది. కానీ పెళ్లి తర్వాత చాలాకాలంపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది ఈ భామ. ఇప్పుడిప్పుడే చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది.
తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీలోనూ అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే అక్కడ షారుఖ్ ఖాన్ హీరోనా నటించిన జవాన్ సినిమాతో మెప్పించింది. అయితే సినిమా ఇండస్ట్రీకి ఈ బ్యూటీకి ఓ దగ్గర బంధువు ఉంది. ఆమె కూడా ఓ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.? ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ నటి విద్య బాలన్. ప్రియామణి, విద్యాబాలన్‌లు చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ తారలు. అయితే ఇప్పుడు ప్రియమణి చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ దగ్గరి బంధువులే అని ప్రియమణి తెలిపారు.
ఒక ఇంటర్వ్యూలో, ప్రియా మణి విద్యాబాలన్ తో ఉన్న సంబంధం గురించి తెరిచింది. విద్యాబాలన్ తన తండ్రి వైపు తరపు బంధువు అని ప్రియమణి అన్నారు. అయితే మీ మిద్దరం పెద్దగా కలవలేదు కేవలం రెండు సార్లు మాత్రమే మీట్ అయ్యాం అని తెలిపింది ప్రియా. మొదటిసారి ఓ అవార్డు వేడుకలో కలిశారు ఈ ఇద్దరూ. ఆ రోజు ప్రియకు అవార్డు అందించింది విద్యా. విశాఖపట్నంలో జరిగిన ఒక అవార్డు వేడుకలో తాము తొలిసారిగా కలుసుకున్నామని తెలిపింది. విద్య మొదట ‘ప్రియా, ఎలా ఉన్నావు?’ అని కూడా అడిగింది. ఆ తర్వాత కౌగిలించుకున్నాం అని చెప్పింది. అలాగే షారుఖ్ ఖాన్ పుట్టినరోజు వేడుకలో రెండోసారి కలుసుకున్నాం. అప్పుడు కూడా విద్య ప్రేమగా మాట్లాడిందని ప్రియా గుర్తు చేసుకున్నారు. తనకు విద్యతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, ఆమె ముంబైకి వెళ్లినప్పుడల్లా విద్య తండ్రిని చూస్తానని ప్రియా మణి చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.