AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ధనుష్ చాలా రూడ్.. ఆరోజు దారుణంగా ప్రవర్తించారు.. టాలీవుడ్ హీరోయిన్..

ప్రస్తుతం ఇరుముడి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 21న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియా భవానీ శంకర్ కోలీవుడ్ హీరో గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Tollywood : ధనుష్ చాలా రూడ్.. ఆరోజు దారుణంగా ప్రవర్తించారు.. టాలీవుడ్ హీరోయిన్..
Dhanush
Rajitha Chanti
|

Updated on: Aug 22, 2026 | 7:53 PM

Share

న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, తన ప్రతిభతో తమిళం, తెలుగు భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా భవానీ శంకర్. తాజాగా రవితేజ సరసన ఇరుముడి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ స్టార్ హీరో ధనుష్‌పై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రారంభంలో ధనుష్‌పై తనకు కలిగిన అభిప్రాయాన్ని బయటపెట్టారు. తన యాంకరింగ్ ప్రారంభ రోజుల్లో ధనుష్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు, అతని ప్రవర్తనను ప్రియ భవాని శంకర్ రూడ్‌గా భావించారట. తాను నటిగా మారిన తర్వాత, ప్రమోషన్ల సమయంలో తరచుగా ఎదురయ్యే ప్రశ్నలు, దానివల్ల కలిగే అలసటను ఆమె స్వయంగా అనుభవించారు. అప్పుడు ధనుష్ ప్రవర్తన వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకున్నానని అన్నారు. ప్రతి ఒక్కరికీ వారి సొంత సమస్యలు, ఒత్తిడి ఉంటాయని ఆమె గ్రహించినట్లు చెప్పుకొచ్చారు

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్‏లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?.

ఆమె యాంకర్‌గా ఉన్న రోజుల్లో ప్రముఖ నటుడు ధనుష్‌ను ఇంటర్వ్యూ చేసిన ఒక సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ధనుష్ చాలా అలసిపోయి, ఇంటర్వ్యూపై పెద్దగా ఆసక్తి చూపలేదని ఆమె తెలిపారు. దీని నుండి ఎప్పుడు బయటపడతాను? అన్నట్లుగా అతని మూడ్ ఉందని ప్రియ భవాని శంకర్ పేర్కొన్నారు. అప్పుడు అతని ప్రవర్తనను ఎంత అహంకారం! ఎంత యాటిట్యూడ్! అని ఆమె భావించారట.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..

అయితే, కాలక్రమేణా ప్రియ భవాని శంకర్ నటిగా మారిన తర్వాత, సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం ప్రారంభించారు. ఆ సమయంలో పదే పదే ఒకే రకమైన ప్రశ్నలను ఎదుర్కోవడం, అది ఎంత అలసటతో కూడుకున్నదో ఆమె స్వయంగా అనుభవించారు. అప్పుడే ధనుష్ ప్రవర్తన వెనుక ఉన్న కారణాన్ని ఆమె అర్థం చేసుకున్నారు. తాజాగా ధనుష్‌ను కలిసినప్పుడు లేదా అతనితో నటించినప్పుడు, నువ్వు చాలా రూడ్‌గా ఉన్నావని నేను నిజంగా అనుకున్నాను, డూడ్ అని తాను అతనికి చెప్పానని ప్రియ భవాని శంకర్ వెల్లడించారు. ఈ అనుభవం ద్వారా ఆమె ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నారు: తెరపై కనిపించే వారి అహంకారం లేదా నిర్లక్ష్యం వెనుక వారి సొంత సమస్యలు, ఒత్తిడి ఉండవచ్చు. వారు కేవలం తమ పరిస్థితికి ప్రతిబింబం మాత్రమేనని ఆమె అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో

ప్రియా భవానీ శంకర్..

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..

Follow Us