Pooja Hegde: పూజా హెగ్డే ఇంట పెళ్లి బాజాలు..ఎన్నడూ లేనంతా హ్యాపీగా ఉన్నానంటూ ఎమోషనల్‌

|

Jan 30, 2023 | 9:57 AM

పెళ్లికి సంబంధించి అన్నీ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంది పూజా. సుమారు వారం రోజుల నుంచి ఇంటి దగ్గరే ఉంటూ పెళ్లి ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది

Pooja Hegde: పూజా హెగ్డే ఇంట పెళ్లి బాజాలు..ఎన్నడూ లేనంతా హ్యాపీగా ఉన్నానంటూ ఎమోషనల్‌
Actress Pooja Hegde
Follow us on

స్టార్‌ హీరోయిన్‌ పూజాహెగ్డే ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆమె సోదరుడు రిషబ్‌ హెగ్డే వివాహం అంగరంగవైభవంగా జరిగింది. శివానీశెట్టి అనే మహిళను అతను వివాహమాడాడు. ఈ పెళ్లికి సంబంధించి అన్నీ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంది పూజా. సుమారు వారం రోజుల నుంచి ఇంటి దగ్గరే ఉంటూ పెళ్లి ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుక ప్రారంభం నుంచి నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నా. చిన్నపిల్లలా నవ్వేశా. ఆనందభాష్పాలు వచ్చాయి. మా సోదరుడు తన జీవితంలో తదుపరి అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాడు. మీరు కూడా నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అని తన ప్రేమను కురిపించిందీ బుట్టబొమ్మ. పెళ్లి ఫొటోల్లో పూజా హెగ్డే ఎర్రని పట్టుశారీలో ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ తారలు, నెటిజన్లు, అభిమానులు సైతం కొత్త దంపతులకు శుభాకాంక్షలు, విషెస్‌ తెలియజేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్, సర్కస్ (హిందీ) సినిమాల్లో నటించింది. అయితే అన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె సల్మాన్‌ ఖాన్‌తో కలిసి కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో వెంకటేశ్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దీంతో పాటు మహేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28 సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ పట్టాలెక్కనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..