Nidhi Agarwal: తమిళ్ స్టార్ హీరోతో ఇస్మార్ట్ బ్యూటీ పెళ్లి.. త్వరలోనే ప్రకటనంట.. షాక్‏లో ఫ్యాన్స్..

సినీ పరిశ్రమలోకి ఎప్పటికప్పుడు కొత్తతరం హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. అందులో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్‏తోపాటు

Nidhi Agarwal: తమిళ్ స్టార్ హీరోతో ఇస్మార్ట్ బ్యూటీ పెళ్లి.. త్వరలోనే ప్రకటనంట.. షాక్‏లో ఫ్యాన్స్..
Nidhi

Updated on: Feb 02, 2022 | 8:35 AM

సినీ పరిశ్రమలోకి ఎప్పటికప్పుడు కొత్తతరం హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. అందులో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్‏తోపాటు వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీగా మారిపోవడం చాలా కష్టమే. అలా ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నిధి అగర్వాల్. ఈ సినిమాతో నిధి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ.

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా నిధి అగర్వాల్ పెళ్లి ముచ్చట్లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తమిళ్ స్టార్ హీరో శింబుతో నిధి ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరి పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే లేటేస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ లవ్ బర్డ్స్ ఈ సంవత్సరంలోనే పెళ్లి చేసుకోబోతున్నారట. త్వరలోనే తమ వివాహా తేదీని ప్రకటించనున్నారని సమాచారం. వీరిద్దరూ జంటగా.. ఈశ్వరన్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుచింద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని.. గత కొద్ది కాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లుగా ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు, నిధి గానీ.. శింబు గానీ స్పందించలేదు. మరీ నిజాంగానే ఇస్మార్ట్ బ్యూటీ పెళ్లి పీటలెక్కనుందో లేదో చూడాలి.

Also Read: Jayaprada: జయప్రద ఇంట తీవ్ర విషాదం.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన సీనియర్ నటి

Brahmanandam Birthday: సినిమా తెర నుంచి డిజిటల్ పేజీల వరకూ బ్రహ్మాండమంత ఆనందం!

Panja Vaisshnav Tej : మెగా హీరో సినిమానుంచి మూడోవ సినిమా మొదటి సింగిల్ రెడీ అయ్యిందంటా..