Nayanthara: ఇన్‌స్టాగ్రామ్‌లోకి నయనతార ఎంట్రీ.. లేడీ సూపర్‌ స్టార్‌ ఫాలో అవుతోన్న ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా?

|

Aug 31, 2023 | 2:04 PM

సినిమాల్లో లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. అయితే కెరీర్‌ ఆరంభం నుంచి ఆమె కొన్ని రూల్స్‌ ఫాలో అవుతోంది. సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటోంది. అలాగే సామాజిక మాధ్యమాల నుంచి డిస్టేన్స్‌ పాటిస్తోంది. నెగెటివిటీ, ట్రోలింగ్‌, విమర్శలు వీటి నుంచి సాధ్యమైనంవరకూ దూరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుందీ అందాల తార.

Nayanthara: ఇన్‌స్టాగ్రామ్‌లోకి నయనతార ఎంట్రీ.. లేడీ సూపర్‌ స్టార్‌ ఫాలో అవుతోన్న ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా?
Nayanthara
Follow us on

సినిమాల్లో లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. అయితే కెరీర్‌ ఆరంభం నుంచి ఆమె కొన్ని రూల్స్‌ ఫాలో అవుతోంది. సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటోంది. అలాగే సామాజిక మాధ్యమాల నుంచి డిస్టేన్స్‌ పాటిస్తోంది. నెగెటివిటీ, ట్రోలింగ్‌, విమర్శలు వీటి నుంచి సాధ్యమైనంవరకూ దూరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుందీ అందాల తార. ఇక తన పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ విషయాలను కూడా ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌నే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేవాడు. అయితే తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది నయనతార. గురువారం (ఆగస్టు 31) ఉదయం సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన అకౌంట్‌కు లవ్‌ ,స్ట్రెంత్‌, పీస్‌ అను క్యాప్షన్‌ను బయోగా పెట్టుకుంది. ఈ సందర్బంగా తన కవల పిల్లలతో కలిసున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి పోస్ట్‌ను షేర్‌ చేసింది నయన్‌. ఇందులో న‌య‌న‌తారతో పాటు ఆమె ట్విన్స్‌ సన్‌గ్లాసెస్‌ ధరించి స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఐదుగురిని మాత్రమే ఫాలో అవుతోన్న నయన్‌..
ఆతర్వాత కాసేపటికే షారుక్‌తో కలిసి ఆమె నటించిన ట్రైలర్‌ రిలీజయ్యాయి. దీంతో హిందీ, తమిళ్‌ ట్రైలర్లను వెంటవెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. నయనతార ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచిన గంటలోపే ఫాలోవర్స్‌ పోటెత్తారు. ఇప్పటివరకు సుమారు నలభైవేల మందికి పైగా ఆమెను అనుసరించడం విశేషం. ఇక నయన్‌ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం ఐదుగురిని మాత్రమే ఫాలో అవుతుంది. అందులో తన భర్త విఘ్నేశ్‌ శివన్‌, బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌, అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా సతీమణి మిచెల్ ఒబామా ఇన్‌స్టా ఖాతాలను నయనతార ఫాలో అవుతోంది. దీంతో పాటు తన తన సొంత నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌ అకౌంట్స్‌ను అనుసరిస్తోంది. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార ఫాలో అవుతన్న ఏకైక హీరో షారుఖ్‌ ఖాన్‌ కావడం గమనార్హం. కాగా బాలీవుడ్ బాద్‌షాతో నయన్‌ కలిసి నటించిన జవాన్‌ సినిమా సెప్టెంబర్‌ 7న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. బాలీవుడ్‌లో ఆమె నటిస్తోన్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

నయనతార మొదటి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ఇదే

నయనతార ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి