నయనతార.. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్. ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటోందీ అందాల తార. ఇప్పుడామె ఒక్కో సినిమాకు అత్యధికంగా రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. నటిగానే కాకుండా నిర్మాతగానూ సత్తాచాటుతోంది నయన్. తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై పలు సినిమాలను నిర్మిస్తోంది. అలాగే బయటి మూవీస్‌ను కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే పలు వ్యాపారాలు కూడా చేస్తూ కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది నయన్. ఇలా నటిగా, బిజినెస్ వుమన్‌గా జెట్ స్పీడ్‌తో దూసుకెళుతోన్న లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు థియేటర్ అధినేతగానూ అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల చెన్నైలో మూతబడిన అగస్త్య థియేటర్‌ను నయన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని రూపు రేఖలు మార్చి మాల్స్‌తో కూడిన మల్టీ ప్లెక్స్ థియేటర్‌గా మార్చే యోచనలో ఆమె ఉన్నారట. దీనికి సంబంధించిన వార్త కోలీవుడ్ మీడియా సర్కిళ్లలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయంపై నయన్ కానీ ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కాగా గతంలో పలువురు స్టార్ హీరోలు థియేటర్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నయనతార కూడా ఈ జాబితాలో చేరనుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది ఏకంగా 5 సినిమాల్లో నటించింది నయన్. అయితే మధ్యలో వివాహం, పిల్లల దత్తతతో కొద్దిగా గ్యాప్ వచ్చింది. త్వరలోనే షారుఖ్ ఖాన్‌తో కలిసి జవాన్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది లేడీ సూపర్ స్టార్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జవాన్ సినిమా సెప్టెంబర్ 7 న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌లో నయన్‌కు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. దీంతో పాటు మరో మూడు సినిమాలు నయనతార చేతిలో ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.