Mrunal Thakur: కాబోయే భర్తపై మృణాల్ కామెంట్స్.. నెటిజన్ అలా స్పందించడంతో హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్..

ఇటీవల కపిల్ శర్మ షోలో పాల్గొన్నప్పుడు చెప్పిన మాటలను జత చేస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు. ఆమె రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతుందంటూ కామెంట్ చేశారు. ఇది చూసిన మృణాల్ నెటిజన్స్ ట్వీట్ పై అసహనం వ్యక్తం చేసింది.

Mrunal Thakur: కాబోయే భర్తపై మృణాల్ కామెంట్స్.. నెటిజన్ అలా స్పందించడంతో హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్..
Mrunal

Updated on: Feb 12, 2023 | 4:32 PM

ఒక్క సినిమాతోనే దక్షిణాదిలో స్టార్‏డమ్ సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. డైరెక్టర్ హను రాఘవపూడి.. హీరో దుల్కర్ సల్మాన్ కాంబోలో వచ్చిన సీతారామం సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఆమె సహజనటనకు ఆడియన్స్ ముగ్దులయ్యారు. ఈ సినిమా తర్వాత మృణాల్ ఇటీవలే ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె నాని సరసన ఓ సినిమాలో నటిస్తుంది. ఇటీవలే నాని 30 చిత్రీకరణ ప్రారంభమైంది. తాజాగా మృణాల్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అయితే ఓ నెటిజన్ మృణాల్ మాట తీరువు తప్పుబట్టాడు. తనకు కాబోయే భర్త గురించి మృణాల్ గతంలో చేసిన వ్యాఖ్యలు.. ఇటీవల కపిల్ శర్మ షోలో పాల్గొన్నప్పుడు చెప్పిన మాటలను జత చేస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు. ఆమె రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతుందంటూ కామెంట్ చేశారు. ఇది చూసిన మృణాల్ నెటిజన్స్ ట్వీట్ పై అసహనం వ్యక్తం చేసింది.

“నాకు కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయంలో గతంలోనూ ప్రస్తుతం నాకున్న అభిప్రాయాన్ని కనీసం నేను ధైర్యంగా చెప్పగలిగాను.” అంటూ కామెంట్ చేసింది. అయితే మృణాల్ ఇచ్చిన రిప్లై పై పలువురు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందించిన మృణాల్.. నటీనటులు కూడా మనుషులేననే విషయాన్ని కొంతమంది వ్యక్తులు మర్చిపోతారనుకుంటా అంటూ కామెంట్ చేసింది.

ఇవి కూడా చదవండి

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. తనకు కాబోయే భర్త మంచి వాడైతే చాలని.. అందం అనేది విషయం కాదని చెప్పింది. కానీ ఇటీవలే కపిల్ శర్మ షోలో తనకు కాబోయే భర్త అందంగా ఉండాలని చెప్పుకొచ్చింది. ఇక ఇవే కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.