AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : 19 ఏళ్ల చిన్నోడితో 52 ఏళ్ల హీరోయిన్ డేటింగ్.. ఎట్టకేలకు ట్రోలింగ్ పై స్పందించిన బ్యూటీ..

సాధారణంగా సోషల్ మీడియాలో హీరోయిన్స్ పర్సనల్ విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఓవైపు గ్లామర్ ఫోటోషూట్స్ పై నెటిజన్స్ తమదైన శైలీలో స్పందిస్తుంటారు. అలాగే తారల ఫ్రెండ్షిప్స్, లవ్, డేటింగ్ గురించి ఎప్పుడూ ఏదోక వార్త హాల్చల్ చేస్తుంటుంది. తాజాగా ఓ హీరోయిన్ డేటింగ్ పై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరగ్గా తాజాగా ఆమె స్పందించింది.

Actress : 19 ఏళ్ల చిన్నోడితో 52 ఏళ్ల హీరోయిన్ డేటింగ్.. ఎట్టకేలకు ట్రోలింగ్ పై స్పందించిన బ్యూటీ..
Malaika Arora
Rajitha Chanti
|

Updated on: May 29, 2026 | 6:44 PM

Share

బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా స్పెషల్ పాటలతో ఆమె సృష్టించిన ప్రభంజనం గురించి తెలిసిందే. అయితే ఇటీవల కొన్నాళ్లుగా ఆమె వ్యక్తిగత జీవితం కారణంగా నెట్టింట నిరంతరం వార్తలలో ఉంటుంది. నటుడు అర్బాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత మలైకా డేటింగ్ జీవితంపై విస్తృతంగా చర్చ జరిగింది. గతంలో ఆమె నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసింది. ఇద్దరి మధ్య 12 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అర్జున్, మలైకా కంటే 12 ఏళ్లు చిన్నవాడు. దీంతో ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ పై ట్రోలింగ్ నడిచింది. అవేమి పట్టించుకోకుండా ఉన్నారు వీరిద్దరు. అయితే కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత, వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు మరోసారి, తనకంటే 19 ఏళ్లు చిన్నవాడైన ఒక వ్యాపారవేత్తతో మలైకా డేటింగ్ చేస్తుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

వజ్రాల వ్యాపారి హర్ష్ మెహతాతో ఆమె ప్రేమాయణం గురించి నెట్టింట ప్రచారం జరగడంతో ఆమె పై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు వాటిపై మలైకా మౌనం వీడింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్‌పై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో, తాను తన చుట్టూ ఒక సరిహద్దును సృష్టించుకున్నానని ఆమె వివరించారు. ఇది బయటి గందరగోళం నుండి తనను తాను కాపాడుకోవడానికి, దాని ప్రభావం తనపై పడకుండా చూసుకోవడానికి సహాయపడుతుందని ఆమె తెలిపారు. “ఇంటర్నెట్‌లో చాలా గందరగోళం ఉంటుంది. కానీ అది ఎల్లప్పుడూ సరైనదిగా లేదా తెలివైనదిగా ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, నేను నా మనసులోని సంతోషాన్ని కాపాడుకుంటాను. ఈ రెండింటికీ తేడా ఉంది. ఇన్నేళ్లుగా నేను నేర్చుకున్నదేమిటంటే, ఇతరుల అభిప్రాయాల కోసం మీరు నిరంతరం మీ మనశ్శాంతిని త్యాగం చేస్తే, మీకు ఎప్పటికీ అంతర్గత శాంతి లభించదు. నేను ఒక సరిహద్దును సృష్టించుకోవడం నేర్చుకున్నాను” అని మలైకా అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

“సోషల్ మీడియాలో నా గురించి చెప్పే ప్రతి కామెంట్ నేను ఇకపై చదవను. ప్రతి అభిప్రాయాన్ని నేను మనసుకు తీసుకోను. నేను నా నిజ జీవితం, నా పని, నా కుటుంబం, నా దైనందిన జీవితం , నాకు నిజంగా ఆనందాన్ని, బలాన్ని ఇచ్చే విషయాలపై ఆధారపడతాను. ఇవే నన్ను నేల మీద నిలబెడతాయి. నిజం చెప్పాలంటే, వయసుతో పాటు మన దృక్పథం కూడా మారుతుంది. ప్రతి చిన్న విషయానికి స్పందించడం మానేయాలి. ట్రోల్ చేయడం అనేది వినేవారి కంటే, చేసే వ్యక్తి గురించే ఎక్కువగా చెబుతుందని మీరు గ్రహించాలి. ఈ రోజు, నన్ను నేను మరింత బాగా తెలుసుకోవడంలోనూ, ఆ అవగాహనలో స్థిరంగా ఉండటంలోనూ నా ఆనందం ఉంది. అదే నా ఆనందం. ఇది వ్యక్తిగతమైనది, గోప్యమైనది , ఇది బహిరంగ చర్చకు సంబంధించినది కాదు.” అని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

మలైకా ఆరోరా ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Zoom TV (@zoomtv)

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

Follow Us