AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhu Bala: అందుకే సినిమాలకు బ్రేక్ తీసుకున్న.. అసలు విషయం చెప్పిన మధుబాల

అందం అభినయంతో ఈ అమ్మడు విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మధుబాలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాతో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే

Madhu Bala: అందుకే సినిమాలకు బ్రేక్ తీసుకున్న.. అసలు విషయం చెప్పిన మధుబాల
Madhoo Bala
Rajeev Rayala
|

Updated on: Jul 08, 2023 | 5:43 PM

Share

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన సీనియర్ హీరోయిన్స్ లో మధుబాల ఒకరు. అప్పట్లో ఐశ్వర్య రాయ్ కు పోటీ ఇచ్చే బ్యూటీగా ఈ అమ్మడుకు మంచి క్రేజ్ ఉంది. అందం అభినయంతో ఈ అమ్మడు విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మధుబాలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాతో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో మధుబాల నటన, అందం ప్రేక్షకులను ఫిదా చేసింది. హీరోయిన్ గా రాణిస్తున్న సినిమయంలోనే ఆమె సినిమాలకులాంగ్ బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన స్వీట్ కారం కాఫీ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఆమె సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటో చెప్పింది.   అయితే మధుబాల సినిమాలకు దూరం కావడానికి ఓ కారణం ఉందట. అదేంటంటే..

మధుబాల హిందీలో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేసింది. మధు బాల ‘పూల్ ఔర్ కాంఠే’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటించాడు. ఈ సినిమాతర్వాత ఆమె పలు సినిమాలో నటించి క్రేజ్ తెచ్చుకుంది.

అయితే ఆతర్వాత ఆమె బిజీ హీరోయిన్ అయిన తర్వాత హిందీలో ఓ సినిమాలో హీరోకు తల్లిగా చేసే ఆఫర్ వచ్చిందట.అదికూడా తన తోలి సినిమా హీరో అజయ్ దేవగన్ కు.. దాంతో ఆమె ఈ ఆఫర్ కు నో చెప్పడంతో పాటు సినిమాలు బైబై చెప్పారు. ఆతర్వాత పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడిపారు. ఇక ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీ అయ్యింది.

Follow Us