Kayadu Lohar: విజయ్.. నీ స్వార్థం కోసం ఇంకా ఎంత మంది కావాలి.. డ్రాగన్ హీరోయిన్ ఎమోషనల్..

కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రతం తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) పార్టీని స్థాపించారు. ఇప్పుడిప్పుడే పూర్తిగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఆయన పార్టీ ప్రచార సభ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 39 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

Kayadu Lohar: విజయ్.. నీ స్వార్థం కోసం ఇంకా ఎంత మంది కావాలి.. డ్రాగన్ హీరోయిన్ ఎమోషనల్..
Kayadu Lohar

Updated on: Sep 28, 2025 | 3:25 PM

కోలీవుడ్ హీరో దళపతి విజయ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన ఆయన.. ఇప్పుడు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నారు. కొన్నాళ్ల క్రితం తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించారు. ఇప్పుడు సినిమాలు పూర్తిగా తగ్గించి.. రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం విజయ్ పార్టీ ప్రచార సభ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట లో దాదాపు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మృతుల్లో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉండడంతో ఈ ఘటన మరింత విషాదం నింపింది. ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై డ్రాగన్ మూవీ హీరోయిన్ కయాదు లోహర్ తీవ్రస్థాయిలో స్పందించింది.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ఇవి కూడా చదవండి

కరూర్ లో జరిగిన ఈ దుర్ఘటనలో తనకు అత్యంత సన్నిహితులైన వారిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు కారణం టీవీకే స్వార్థ రాజకీయాలేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. “ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. కరూర్ ర్యాలీలో నా అత్యంత సన్నిహితులలో ఒకరిని కోల్పోయాను. ఇదంతా టీవీకే స్వార్థ రాజకీయాల కోసమే. విజయ్.. మీ స్టార్డమ్ కు ప్రజలు ఆసరా కాదు.. మీ ఆకలికి ఇంకా ఎన్ని జీవితాలు నాశనం కావాలి” అంటూ కాయదు లోహర్ పేరుతో ఉన్న ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. మరోవైపు ఇది తన అధికారిక అకౌంట్ కాదని.. ఎవరో కావాలని మిస్ కమ్యూనికేట్ చేస్తున్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంపై కాయదు లోహర్ ఇంకా స్పందించలేదు.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..

ఇప్పటికే ఈ విషాదంపై పలువురు సినీతారలు స్పందించారు. రజినీకాంత్, కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. విజయ్ దళపతి ఈనెల 13 నుంచి రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించారు. శనివారం ఉదయం నామక్కల్ లో ప్రచారం చేపట్టిన విజయ్.. సాయంత్రం కరూర్ చేరుకున్నారు. అక్కడి వేలుసామిపురంలో రాత్రి ఏడున్నర గంటలకు విజయ్ ప్రసంగిస్తుండగా ఆయన దగ్గరకు వచ్చేందుకు చాలా మంది ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 39 మంది మరణించినట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..