AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అందంలో అమ్మను మించిపోయిందిగా.. హీరోయిన్ లయ కూతురును మీరు చూశారా.?

టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన సీనియర్ హీరోయిన్ లయ.. 90వ దశకంలో ఓ వెలుగు వెలిగింది. తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుని ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె ఫ్యామిలీ ఫోటోలు మీరు ఎప్పుడైనా చూశారా.. ఆమె కూతురు అచ్చం అమ్మలా..

Tollywood: అందంలో అమ్మను మించిపోయిందిగా.. హీరోయిన్ లయ కూతురును మీరు చూశారా.?
Laya
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 28, 2025 | 5:00 PM

Share

టాలీవుడ్‌లో పక్కింటి అమ్మాయిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ లయ. తెలుగులో ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 90వ దశకంలో టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ నటించి.. తన నటనతో మెప్పించింది. హీరోయిన్ కాకముందు చైల్డ్ ఆర్టిస్టుగానూ పలు చిత్రాలలో నటించిన ఈమె.. చిన్నప్పుడే ఇండస్ట్రీకి పరిచయమైంది. భద్రంకొడుకో సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ లయ. ఆ తర్వాత వేణు తొట్టెంపూడి హీరోగా వచ్చిన స్వయంవరం చిత్రం ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయింది.

ఈ సినిమా హిట్ కావడంతో లయకు వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి. మెయిన్ లీడ్‌గానే కాకుండా పలు మల్టీస్టారర్ చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గానూ నటించింది ఈ భామ. దాదాపుగా పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా అలరించిన లయ.. కెరీర్ మధ్యలోనే పెళ్లి చేసుకుంది. అలాగే అమెరికాలో సెటిల్ అయ్యి.. మొత్తంగా సినిమాలకు దూరమయ్యింది. చివరిగా బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం చిత్రంలో కనిపించిన లయ.. మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చి అమర్ అక్బర్ అంటోనీ, తమ్ముడు లాంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది. అలాగే బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తమ వ్యక్తిగత విషయాలను, ఫ్యామిలీ ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా ఆమె ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అందులో లయ కూతురు శ్లోకా స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది. అందంలో అమ్మను మించిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే లయ కూతురు శ్లోకా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. మీరూ హీరోయిన్ లయ ఫ్యామిలీ ఫోటోలపై ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

Follow Us
పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక..
పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక..
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్