AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya-Jyothika: విడాకుల రూమర్స్ పై తొలిసారి జ్యోతిక రియాక్షన్.. ముంబై షిఫ్ట్ కావడానికి కారణం అదే..

ఇటీవల కొన్ని నెలలుగా సౌత్ ఇండస్ట్రీలో బ్యూటీఫుల్ జోడి సూర్య, జ్యోతిక విడిపోయారని.. అందుకే జ్యోతిక తన పిల్లలను తీసుకుని ముంబై షిఫ్ట్ అయ్యారంటూ ప్రచారం నడిచింది. సూర్య ఫ్యామిలీతో జ్యోతికకు మనస్పర్థలు రావడమే ఇందుకు కారణమని.. అందుకే వీరు విడాకులు తీసుకున్నారంటూ టాక్ వినిపించింది. అయితే ఇప్పటివరకు వీరిద్దరు ఈ వార్తలపై స్పందించలేదు. కానీ మొదటిసారి జ్యోతిక డివోర్స్ రూమర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Suriya-Jyothika: విడాకుల రూమర్స్ పై తొలిసారి జ్యోతిక రియాక్షన్.. ముంబై షిఫ్ట్ కావడానికి కారణం అదే..
Jyothika, Suriya
Rajitha Chanti
|

Updated on: Jan 27, 2024 | 4:54 PM

Share

సినీ పరిశ్రమలో చాలాకాలంగా నటీనటుల వ్యక్తిగత జీవితం గురించి అనేక వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో స్టార్ కపూల్స్ విడాకుల రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ కపూల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ డివోర్స్ తీసుకున్నారంటూ టాక్ నడిచింది. అయితే ఈ రూమర్స్ పై వీరిద్దరూ స్పందించలేదు. కానీ ఎప్పటికప్పుడు తమ కుటుంబాలతో కలిసి కనిపిస్తూ డివోర్స్ రూమర్స్ కు చెక్ పెడుతున్నారు. ఇక ఇటీవల కొన్ని నెలలుగా సౌత్ ఇండస్ట్రీలో బ్యూటీఫుల్ జోడి సూర్య, జ్యోతిక విడిపోయారని.. అందుకే జ్యోతిక తన పిల్లలను తీసుకుని ముంబై షిఫ్ట్ అయ్యారంటూ ప్రచారం నడిచింది. సూర్య ఫ్యామిలీతో జ్యోతికకు మనస్పర్థలు రావడమే ఇందుకు కారణమని.. అందుకే వీరు విడాకులు తీసుకున్నారంటూ టాక్ వినిపించింది. అయితే ఇప్పటివరకు వీరిద్దరు ఈ వార్తలపై స్పందించలేదు. కానీ మొదటిసారి జ్యోతిక డివోర్స్ రూమర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ముంబై షిఫ్ట్ కావడానికి గల కారణాలను వెల్లడించారు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది జ్యోతిక.. కానీ ఇప్పుడిప్పుడే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తమిళంలో పలు చిత్రాల్లో నటించి మరోసారి ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె హిందీలో రెండు సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్, పిల్లల చదువుల కోసమే ముంబై వెళ్లామని.. పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వరలోనే చెన్నై తిరిగి వస్తామని అన్నారు జ్యోతిక. దీంతో వీరిద్దరి విడాకుల వార్తలకు చెక్ పడింది.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జ్యోతిక వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. అటు ఇటీవలే ఆమె నటించిన కథల్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే జ్యోతిక నటించిన సైతాన్ సినిమా టీజర్ రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైంది. చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న సూర్య, జ్యోతిక 2006 సెప్టెంబర్ 11న ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

View this post on Instagram

A post shared by Jyotika (@jyotika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.