Janhvi Kapoor: శ్రీదేవికి ఇష్టమైన ఆలయాన్ని దర్శించుకున్న జాన్వీ కపూర్ .. ఫొటోస్ వైరల్
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. మొదటి సినిమా ధడక్ తోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్, గుడ్ లక్ జెర్రీ, మిలీ, రూహీ, బవాల్ వంటి సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. త్వరలోనే ఎన్టీఆర్ తో కలిసి...
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. మొదటి సినిమా ధడక్ తోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్, గుడ్ లక్ జెర్రీ, మిలీ, రూహీ, బవాల్ వంటి సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. త్వరలోనే ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుందీ అందాల తార. ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహీ. ఇందులో రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్నాడు. మహిమ అనే పాత్రలో జాన్వీ కనిపించనుంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 31న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోందీ జాన్వీ. ఆదివారం (మే26) చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు కూడా హాజరైంది. కేకేఆర్ కు మద్దతుగా సందడి చేసింది. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటోన్న జాన్వీ కపూర్ అక్కడి ప్రముఖ ముప్పాతమ్మన్ ఆలయాన్ని దర్శించుకుంది. జాన్వీ వెంట శ్రీదేవి సోదరి, గులాబి హీరోయిన్ మహేశ్వరి కూడా ఉంది.
కాగా చెన్నైలోని ముప్పాతమ్మన్ ఆలయం దివంగత శ్రీదేవికి బాగా ఇష్టమట. ఈ నేపథ్యంలో మొదటిసారి ఈ దేవ స్థానంలో అడుగుపెట్టింది జాన్వీ. అమ్మ ఎంతగానో ఇష్టపడే ఆలయాన్ని మొదటిసారి సందర్శించానని జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో తెలిపింది. అలాగే గుడి సందర్శనకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇందులో సంప్రదాయ సంప్రదాయ లంగా ఓనీలో ఎంతో అందంగా కనిపించింది జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈ ఫొటోల సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.
చెన్నైలోని దేవ స్థానంలో జాన్వీ కపూర్, మహేశ్వరి..
View this post on Instagram
ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది జాన్వీ. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు రామ్ చరణ్, బుచ్చి బాబు సనాల కాంబినేషన్ లో వస్తోన్న మెగా ప్రాజెక్టులోనూ ఈ జూనియర్ శ్రీదేవి హీరోయిన్ గా నటిస్తోంది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో రాజ్ కుమార్ రావు, జాన్వీ కపూర్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.