Actress: ఆ హీరోయిన్‏ను 14 సార్లు చెంపదెబ్బలు కొట్టిన స్టార్ హీరో.. ముఖంపై ఆ గుర్తులు అలాగే..

ఒకప్పుడు తెలుగు సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఎక్కువగా తెలుగు చిత్రాల్లోనే నటించింది. వరుస హిట్స్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకి రావాల్సిన బ్రేక్ మాత్రం రాలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Actress: ఆ హీరోయిన్‏ను 14 సార్లు చెంపదెబ్బలు కొట్టిన స్టార్ హీరో.. ముఖంపై ఆ గుర్తులు అలాగే..
Isha Koppikar

Updated on: Jul 30, 2025 | 2:04 PM

దక్షిణాదిలో ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఓ సినిమా షూట్ సమయంలో సీన్ కోసం తెలుగు స్టార్ హీరో తనను 14 సార్లు చెంపదెబ్బలు కొట్టారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె మరెవరో కాదు.. ఇషా కొప్పికర్. 1998లో చంద్రలేఖ సినిమాతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. దక్షిణాది సూపర్ స్టార్ నాగార్జునతో కలిసి జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ పంచుకుంది. ఓ సినిమా సమయంలో నాగ్ తనను 14 సార్లు చెంపదెబ్బ కొట్టారని గుర్తుచేసుకుంది.

ఓ ఇంటర్వ్యూలో ఇషా కొప్పికర్ మాట్లాడుతూ.. ” చంద్రలేఖ సినిమాలో నాగార్జున నన్ను చెంపదెబ్బ కొట్టే సీన్ ఉంటుంది. ఆయన నన్ను సాఫ్ట్ గానే చెంపదెబ్బ కొట్టారు. కానీ నాకు ఎలాంటి ఫీల్ రాలేదు. నాకు అది రెండవ సినిమానే. దీంతో నిజంగానే నన్ను కొట్టాలని నాగార్జునతో చెప్పాను. ఆయన కొట్టలేను అని చెప్పారు. కానీ నేను సహజమైన యాక్టింగ్ రావాలంటే కొట్టాలని చెప్పాను. చాలాసార్లు టేక్స్ తీసుకున్న తర్వాత చివరకు ఒక్క సీన్ కోసం ఆయన దాదాపు 14 సార్లు చెంపదెబ్బలు కొట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో నా చెంపపై గుర్తులు అలాగే కనిపించాయి. దీంతో నాకు నాగార్జున సారీ చెప్పారు ” అంటూ ఆ క్షణాలను గుర్తుచేసుకుంది.

చంద్రలేఖ సినిమాలో ఇషా కొప్పికర్ కథానాయికగా కనిపించింది. డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, మురళీ మోహన్, చంద్రమోహన్, గిరిబాబు, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషించారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఇషా కొప్పికర్.. ఇటీవలే అయాలాన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

Isha Koppikar, Nagarjuna

ఇవి కూడా చదవండి.. 

ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..

Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..

Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..