Faria Abdullah: ఆ హీరోలతో కలిసి నటించాలని ఉందంటున్న చిట్టి.. ఫరియా మనసుపడిన స్టార్స్ ఎవరంటే..
డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ చిత్రప్రమోషన్స్ లో భాగంగా కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకుంది ఫరియా.
డైరెక్టర్ అనుదీప్ కెవి తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో వెండితెరకు పరిచయమైంది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఆ తర్వాత తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంది. తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఫరియాను అభిమానులు చిట్టి అంటూ ముద్దుగా పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే. జాతిరత్నాలు తర్వాత బంగర్రాజు చిత్రంలో అలరించిన ఫరియా.. ప్రస్తుతం మాస్ మాహారాజా రవితేజ నటిస్తోన్న రావణాసుర చిత్రంలో నటిస్తోంది. డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ చిత్రప్రమోషన్స్ లో భాగంగా కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకుంది ఫరియా.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరియా మాట్లాడుతూ.. రవితేజ కాంబినేషన్లో తన సీన్స్ చాలా ఉన్నాయని.. ఆయన కామెడీ టైమింగును.. ఎనర్జీని అందుకోవడం చాలా కష్టమని తెలిపింది. చాలా సమయం ప్రిపేర్ అయిన తర్వాతనే కెమెరా ముందుకు వెళ్లేదాన్ని అని.. షూటింగ్ గ్యాపులో మాత్రం రవితేజ చాలా సరదాగా ఉంటారని తెలిపిందే. రావణాసుర తర్వాత బిజీ అయ్యే ఛాన్స్ ఉందనుకున్నట్లు చెప్పుకొచ్చిన ఫరియా.. తనకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చరణ్.. బన్నీ.. విజయ్ దేవరకొండలతో కలిసి నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టేసింది. అలాంటి ఒక అవకాశం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది ఫరియా.
రావణాసుర చిత్రంలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఫరియా అబ్దు్ల్లాతోపాటు… పూజిత పొన్నాడ.. దిక్షా నగార్కర్.. మేఘా ఆకాష్, అను ఇమాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తుండగా.. అక్కినేని సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్, హార్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.