Devayani: ఏం అందం అండి.. సుస్వాగతం హీరోయిన్ కూతురిని చూశారా.. ? పట్టు చీరలో కుందనపు బొమ్మలా ..
దేవయాని... తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు సహాయ నటిగా సెటిల్ అయ్యింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో నటించిన ఆమె.. ఇప్పుడు యంగ్ హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా నటిస్తుంది. తాజాగా దేవయాని కూతురి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

హీరోయిన్ దేవయాని గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన నాని చిత్రంలో హీరో తల్లిగా కనిపించింది. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. దేవయాని తొట్టచినుంగి చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అజిత్ తో కలిసి కాదల్ కొట్టై చిత్రం విజయంతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. కెరీర్ మంచి ఫాంల ఉండగానే.. దర్శకుడు రాజకుమారన్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇనియా, ప్రియాంక.
ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..
పెద్ద కూతురు ఇనియా జీ తమిళ్‌లో ప్రసారమయ్యే సరిగమప సీజన్ 5 షోలో పోటీదారుగా పాల్గొని, తన ప్రతిభ, మనోహరమైన స్వరంతో తనకంటూ ఒక ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది. సరిగమప తదుపరి ఎపిసోడ్‌లలో తన గాత్రంతో అలరించిన ఆమె.. ఇటీవలే ఎలిమినేట్ అయ్యింది. దేవయాని కూతురు ఇనియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందులో తన ఫోటోస్, సాంగ్స్ వీడియోస్ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
అందులో ఇనియా.. నెమలి రంగు పట్టు చీరలో, పెళ్లి కూతురులా ముస్తాబయ్యింది. ఆభరణాలతో సాంప్రదాయ లుక్‌లో అందంగా కనిపిస్తోంది. ఆమె తన తల్లి దేవయానిలాగే అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇనియా.. సినీరంగంలో అడుగుపెడుతుందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
