AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: దీపిక ఈజ్ బ్యాక్.. స్టార్ సింగర్‌తో కలిసి ఆటా పాటా! వీడియో ఇదిగో

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఇటీవలే అమ్మగా ప్రమోషన్ పొందింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో పండంటి ఆడబిడ్డను ప్రసవించిందీ అందాల తార. అలాగే తన తమ గారాల పట్టికి దువా పదుకొణె సింగ్ అని నామకరణం కూడా చేశారు.

Deepika Padukone: దీపిక ఈజ్ బ్యాక్.. స్టార్ సింగర్‌తో కలిసి ఆటా పాటా! వీడియో ఇదిగో
Deepika Padukone
Basha Shek
|

Updated on: Dec 07, 2024 | 8:18 PM

Share

దీపికా పదుకొణె ఇప్పుడు బాలీవుడ్‌లో నంబర్ 1 స్టార్ హీరోయిన్. ఇక కల్కి సినిమాతో దక్షిణాదిలోనూ ఆమెకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించిన దీపిక ఇప్పుడు సినిమా షూటింగులకు కాస్త విరామం ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఇప్పుడు తన కూతురు ఆలనా పాలనలో బిజీ బిజీగా ఉంటోంది. దీంతో బయట కూడా పెద్దగా కనిపించడం లేదీ అందాల తార. అయితే ఇప్పుడు బెంగుళూరులో గ్రాండ్ లైవ్ కాన్సర్ట్ లో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది దీపిక. అంతేకాదు ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంగ్ కి కన్నడ నేర్పించింది. ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ దేశమంతా పర్యటస్తున్నాడు. ప్రధాన నగరాల్లో కచేరీలను నిర్వహిస్తున్నాడు. దిల్జీత్ లైవ్ కాన్సర్ట్ టిక్కెట్లు లక్షల్లో అమ్ముడుపోతున్నాయి. ఒక్కో టిక్కెట్టును లక్షకు పైగా బ్లాక్‌లలో విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ‘దిల్లుమినాటి’ టూర్ కొనసాగుతోంది.ఇందులో భాగంగా శుక్రవారం (డిసెంబర్ 06) బెంగళూరులో దిల్జీత్ గ్రాండ్ కాన్సర్ట్ జరిగింది.

దిల్జీత్ బెంగళూరు సంగీత కచేరీకి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. దిల్జీత్ తన ప్రతి కచేరీలో ఒక ప్రత్యేక అతిథిని వేదికపైకి తీసుకువస్తాడు. విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు హాలీవుడ్ తారలను వేదికపైకి అతిధులుగా తీసుకొచ్చాడు దిల్జీత్ దోసాంజ్. శుక్రవారం బెంగుళూరులో షో జరిగినప్పుడు.. కొందరు కన్నడ సినీ తారలను దిల్జీత్ వేదికపైకి తీసుకొస్తాడని అంతా అనుకున్నారు. కానీ దిల్జీత్ దోసాంజ్ మాత్రం దీపికా పదుకొణెని సర్ ప్రైజ్ గెస్ట్ గా తీసుకొచ్చాడు. దీపికా పదుకొనే వేదికపైకి వచ్చి దిల్జీత్ దోసాంజ్‌కి కన్నడ నేర్పింది. దీపికా పదుకొణె వేదికపైకి రాగానే దిల్జీత్ కన్నడలో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ సరిగ్గా మాట్లాడలేకపోయాడు. దీంతో దీపికా పదుకొణె కన్నడలో ‘ఐ లవ్ యూ’ అని చెప్పగా, దిల్జీత్ దోసాంజ్ కూడా అలాగే చెప్పాడు.

ఇవి కూడా చదవండి

కాగా దీపికా పదుకొణె బెంగళూరు అమ్మాయి, ఆమెకు కన్నడ భాష బాగా తెలుసు. ఆమె బెంగళూరులోని తన ఇంటికి వచ్చినప్పుడు కన్నడలో మాత్రమే మాట్లాడుతుందట. అంతేకాదు తన సహనటులకు కూడా కన్నడ నేర్పించిందట. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా సమయంలో షారూఖ్‌కి ​​కన్నడ నేర్పింది దీపిక. ఆమె తన భర్త రణవీర్ సింగ్‌కి కూడా కన్నడ నేర్పింది.

దిల్జీత్ దోసాంజ్ మ్యూజిక్ కన్సర్ట్ లో దీపిక .. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!