Tollywood: బ్లాక్ శారీలో డాన్స్‌తో మతిపోగొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్..
ఆయేషా ఖాన్. అప్పుడెప్పుడో ఓ తెలుగు సినిమాలో నటించింది ఈ ముంబయి బ్యూటీ. ఇప్పుడే తనకు ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి. 2022లో ముఖచిత్రం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆయేషా. ఈ సినిమాకు గంగాధర్ దర్శకత్వం వహించగా.. వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్య రావు, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీలో హీరో విశ్వక్ సేన్ అతిథి పాత్రలో కనిపించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రెటీస్ చేసే సందడి గురించి చెప్పుక్కర్లేదు. స్టార్ హీరోహీరోయిన్ నిత్యం నెట్టింట చురుకుగా ఉంటూ మూవీ అప్డేట్స్, పర్సనల్ విషయాలను పంచుకుంటున్నారు. అలాగే తమ చిన్ననాటి జ్ఞాపకాలను సైతం నెట్టింట షేర్ చేసుకుంటున్నారు. తమ సినిమాల్లోని పాటలకు స్టెప్పులేస్తూ రీల్స్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ డాన్స్‌తో అదరగొట్టేసింది. ప్రస్తుతం ఆ బ్యూటీకి సంబంధించిన రీల్ వైరలవుతుంది. ఇంతకీ తనేవరంటే.. ఆయేషా ఖాన్. అప్పుడెప్పుడో ఓ తెలుగు సినిమాలో నటించింది ఈ ముంబయి బ్యూటీ. ఇప్పుడే తనకు ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి. 2022లో ముఖచిత్రం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆయేషా. ఈ సినిమాకు గంగాధర్ దర్శకత్వం వహించగా.. వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్య రావు, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీలో హీరో విశ్వక్ సేన్ అతిథి పాత్రలో కనిపించారు. ఈ మూవీ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.
ఇక ఇటీవల హిందీలో జరిగిన బిగ్ బాస్ 17కు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లి కొద్ది రోజులకే బయటకు వచ్చింది. దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. అలాగే శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో నటించిన ఓం భూమ్ బుష్ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమా మార్చి 22న రిలీజ్ కానుంది. అలాగే మలయాళంలోనూ ఓ మూవీలో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
ఓవైపు వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న ఆయేషా.. అటు నెట్టింట సైతం నానా హంగామా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ శారీలో ఫేమస్ హిందీ పాటకు ఓ రేంజ్ లో స్టెప్పులేసింది. తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఆ వీడియోలో బ్లాక్ శారీలో నడుమును ఊపుతూ డాన్స్ అదరగొట్టేసింది. మ్యూజిక్ కు తగ్గట్టు స్టెప్పులు వేస్తూ నెటిజన్లను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
