Actress : ఆ సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండానే నటించాను.. కారణం అదే.. సీనియర్ హీరోయిన్..

సాధారణంగా సినిమాల్లో తమ పాత్రకు న్యాయం చేయడానికి ఎలాంటి రిస్క్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. హీరోహీరోయిన్లు తమ సినిమా సక్సెస్ చేయడానికి.. అలాగే ఛాలెంజింగ్ పాత్రలలో నటించడానికి సై అంటారు. అదే విధంగా ఒక హీరోయిన్ సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఆ సినిమా విషయాలను పంచుకుంది.

Actress : ఆ సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండానే నటించాను.. కారణం అదే.. సీనియర్ హీరోయిన్..
Archana

Updated on: Jan 02, 2026 | 9:34 PM

సాధారణంగా దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. హీరోయిన్ కావాలంటే ఒకప్పుడు ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొవాల్సి ఉండేది. ఒక్క ఛాన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన తారలు ఉన్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అంతేకాదు.. అప్పట్లో చాలా మంది హీరోయిన్స్ కేవలం గ్లామర్ రోల్స్ కాకుండా ఛాలెంజింగ్ పాత్రలు పోషించేందుకు రెడీగా ఉండేవారు. సవాళ్లు ఎదురైన పాత్రలు పోషించి నటీమణులుగా ప్రశంసలు అందుకున్నారు. తమ పాత్రలకు ప్రాణం పోసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటన, ప్రభావం చూపే పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు తీశారు. అయితే ఓ హీరోయిన్ అప్పట్లో ఛాలెంజింగ్ రోల్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

ఆమె మరెవరో కాదు.. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ అర్చన. ప్రస్తుతం ఆమె సహాయ నటిగా రాణిస్తుంది. యంగ్ హీరోహీరోయిన్లకు తల్లి పాత్రలు పోషిస్తుంది. కానీ ఆమె కెరీర్ మలుపు తిప్పిన సినిమా నిరీక్షణ. ఈతరానికి ఈ మూవీ గురించి తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ క్లాసిక్ మూవీ. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని సినిమా. ఇందులోని సాంగ్స్ మొత్తం సూపర్ హిట్. ముఖ్యంగా ఇందులోని ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే అనే సాంగ్ ఇప్పటికీ నెట్టింట వినిపిస్తూనే ఉంటుంది. ఇందులో బాను చందర్, అర్చన హీరోహీరోయిన్లుగా నటించారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..

ఈ సినిమా తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న అర్చన.. ఇటీవల షష్టిపూర్తి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె నిరీక్షణ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమా గిరిజన అమ్మాయి పాత్రను పోషించడానికి ఎంతో ధైర్యం కావాలని చెప్పింది. అర్చన మాట్లాడుతూ.. “ఆ సమయంలో నేను బ్లౌజ్ లేకుండా చీరలో నటించాను. అప్పుడు నేను దర్శకుడిని నమ్మాను. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కడా అశ్లీలత లేదు. కాబట్టి ఆయనపై పూర్తి నమ్మకంతో ఆ సినిమాలో నటించాను. ఆ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ అయింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అర్చన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి..

ఇవి కూడా చదవండి :  Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

Archana

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..