
మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ఆమె నటించిన టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో లిల్లీ పాత్ర లో అనుపమ కాస్త బోల్డ్ గా కనిపించినా, ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా ఇప్పటివరకు ఎక్కువగా హోమ్లీ పాత్రలకే పరిమితమైన ఈ మలయాళ ముద్దుగుమ్మ టిల్లు స్క్వేర్ లో మాత్రం గ్లామర్ ఒలక బోసింది. తద్వారా తనలోని సరికొత్త ట్యాలెంట్ ను వెండి తెరకు పరిచయం చేసింది. ఇదిలా ఉంటే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో నూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనుపమ పరమేశ్వరన్. తన లేటెస్ట్ గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా అనుపమ షేర్ చేసిన ఒక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తనకు నడుము నొప్పి వస్తుందని తెలుపుతూ.. అందుకు ఏదైనా చికిత్స బాగుండూ అంటూనే రోడ్ రోలర్‌తో మసాజ్ అయితే బాగుంటుందని అర్థం వచ్చేలా ఆమె ఒక పోస్ట్ షేర్ చేసింది.
ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ, ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. టిల్లు స్క్వేర్‌లో ఎంతో గ్లామరస్ గ కనిపించిన అనుపమ మళ్లీ ఇప్పుడు పరదా అనే ఓ లేడి ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. ‘సినిమా బండి’ తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మలయాళ నటి దర్శన రాజేంద్రన్‌తో పాటు సంగీత, రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన అనుపమ లుక్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. త్వరలోనే పరదా సినిమా గురించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
Anupama Parameswaran
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.