తెలుగుమ్మాయి అయినప్పటికీ మొదటి సినిమా మాత్రం తమిళంలో చేసింది. డిగ్రీ చేస్తున్న సమయంలోనే సినిమాలపై ఉన్న ఆసక్తిగా అటుగా అడుగులు వేసింది.. ముందుగా తమిళ్ స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ నచ్చింది.. ఈ సినిమాతో తమిళ్ ప్రేక్షకులకు చేరువైన ఈ చిన్నది.. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో బెస్ట్ ఇంప్రెషన్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ.. అభినయంతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ చిన్నది.. ఇటీవల ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా నటన పరంగా ప్రశంసలు కూడా అందుకుంది. ఎవరో గుర్తుపట్టండి.. మీకోసం చిన్న క్లూ.. ఈరోజు ఈ హీరోయిన్ పుట్టిన రోజు..
నగుమోము దాచుకున్న ఆ అందాల రాశి మరెవరో కాదండోయ్… తెలుగమ్మాయి అంజలి.. ఫోటో సినిమాతో తెలుగు తెరకు పరిచమయైన ఈ చిన్నది.. షాపింగ్ మాల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వకీల్ సాబ్ సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాలో కీలకపాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా డైరెక్టర్ అనిల్ రావిపూడి .. బాలయ్య కాంబోలో రాబోతున్న సినిమాలో ప్రతినాయకురాలి పాత్రలో న టించనుందని టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంటుంది అంజలి. ఈరోజు అంజలి పుట్టిన రోజు..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.