AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ammu Abhirami : దర్శకుడి ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఎట్టకేలకు ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిన ముద్దుగుమ్మ..

ధనుష్ నటించిన అసురన్ చిత్రంలో హీరో మాజీ ప్రియురాలు మరియమ్మ పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ నారప్పలో కన్నమ్మగా కనిపించింది. ఆ తర్వాత రణస్థలి, డెవిల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇప్పుడు తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Ammu Abhirami : దర్శకుడి ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఎట్టకేలకు ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిన ముద్దుగుమ్మ..
Ammu Abhirami
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2024 | 9:33 PM

Share

అతి చిన్న వయసులోనే నటిగా సినీరంగ ప్రవేశం చేసింది అమ్ము అభిరామి. 17 ఏళ్లకే నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. రాక్షసన్, అసురన్, ఏనుగు వంటి చిత్రాలతో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ధనుష్ నటించిన అసురన్ చిత్రంలో హీరో మాజీ ప్రియురాలు మరియమ్మ పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ నారప్పలో కన్నమ్మగా కనిపించింది. ఆ తర్వాత రణస్థలి, డెవిల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇప్పుడు తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా అమ్ము అభిరామికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. నెట్టింట వినిపిస్తున్న టాక్ ప్రకారం అమ్ము అభిరామి డైరెక్టర్ పార్థి్వ్ మణితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్థివ్ మణి కోమలితో కుక్ షో నాలుగు సీజన్లకు దర్శకత్వం వహించారు. ఈ షోలో అమ్ము అభిరామి పాల్గొంది. అప్పుడు వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే ఆ తర్వాత ప్రేమగా మారిందని.. కొన్నాళ్లుగా వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారని ప్రచారం నడుస్తుంది.

తాజాగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది అమ్ము అభిరామి. తన ఇన్ స్టాలో పార్థివ్ మణితో కలిసి మిర్రర్ సెల్ఫీ తీసుకుంటున్న వీడియోను పోస్ట్ చేస్తూ పార్థివ్ మణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. “హ్యాపీ బర్త్ డే పార్థీవ్.. పుట్టినందుకు.. నా జీవితంలోకి రాబోతున్నందుకు థాంక్స్” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం అమ్ము అభిరామి షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఇన్నాళ్లు సీక్రెట్ గా ఉన్న తన లవ్ స్టోరీని ఎట్టకేలకు బయటపెట్టింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు, పార్థివ్ మణి అమ్ము అభిరామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కెరీర్ విషయానికొస్తే, కోమలితో కుక్ షో నుండి తప్పుకున్న పార్థివ్ మణి ప్రస్తుతం ఓ ఛానల్లో టాప్ కుకు డూప్ కుకు అనే కుకింగ్ రియాల్టీ షోను హోస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం అమ్ము అభిరామి చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

View this post on Instagram

A post shared by Parthiv.Mani (@parthiv.mani)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..