ప్రేమలో పడ్డ మూడున్నర ఏళ్లకే బ్రేక్ అయ్యింది.. కన్నీళ్లు కూడా పెట్టుకున్నానన్న విశ్వక్ సేన్
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.. కానీ విశ్వక్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి. ప్రస్తుతం విశ్వక్ సేన్ ఫంకీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విశ్వక్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఫంకీ అనే సినిమాలో నటిస్తున్నాడు. అనుదీప్ కేవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో విశ్వక్ సేన్‌కు హిట్ పడటం పక్కాగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే గతంలో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి : బిగ్ బాస్ హౌస్‌లోకి అదిరేటి అందం.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూటీ..
విశ్వక్ సేన్ గతంలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన లవ్ బ్రేక్ అయ్యిందని చెప్పుకొచ్చారు విశ్వక్. లైలా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నాడు. విశ్వక్ మాట్లాడుతూ.. టీనేజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయిని చూస్తే ఇష్టం కలుగుతుంది. దాన్ని మనం సీరియస్ రిలేషన్ షిప్ అనుకుంటాం.. నాకు కూడా ఓ స్టోరీ ఉంది. నేను 24ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. ఆ తర్వాత మూడున్నర ఏళ్లకే నా లవ్ బ్రేక్ అయ్యింది.
ఇది కూడా చదవండి : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. 27ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్
24ఏళ్ల వయసులో ప్రేమలో పడటం ఆతర్వాత బ్రేకప్ జరగడంతో చాలా బాధపడ్డాను. ఆతర్వాత దాని నుంచి బయట పడ్డాను.. కెరీర్ మీద ఫోకస్ చేశా.. ఆ తర్వాత నాకు ఎవరి మీద ఇష్టం కలగలేదు. సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. జీవితంలో కొన్ని కొన్ని తలచుకుంటే కన్నీళ్లు వస్తాయి. 27ఏళ్ళ వయసులోనూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కన్నీళ్లు పెట్టుకుంటేనే మనం దాని నుంచి త్వరగా బయటకు రాగలం అని అన్నారు విశ్వక్ సేన్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మూవీ రా బాబు..! సినిమా మొత్తం ఆ సీన్లే.. దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో మాత్రం
విశ్వక్ సేన్ ఇన్ స్టాగ్రామ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
