Rukmini Vasanth: కాంతార… కాంత రుక్మిణి చరిత్ర తెలుసా ??
కన్నడ స్టార్ హీరో రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వకంలో రూపుదిద్దుకున్న కాంతార: చాప్టర్1 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వసూళ్ల సునామీతో గత రికార్డ్‌లను తిరగరాస్తోంది. ఈ క్రమంలో సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హీరోయిన్ రుక్మిణి వసంత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. 'సప్త సాగరాలు దాటి’ సినిమాతో పేరు తెచ్చుకున్న రుక్మిణి, తాజాగా ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలో యువరాణి పాత్రలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
తన నటన, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులతో అందరినీ ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రుక్మిణి వసంత్ ఎవరు? అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ ప్రస్తానం గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రుక్మిణి తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు. 2007లో ఉరి సెక్టార్ వద్ద ఉగ్రవాదులతో జరిగి భీకర పోరులో వీర మరణం పొందారు. దేశం కోసం ప్రాణం అర్పించిన కల్నల్ వసంత్‌కు భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక గౌరవం ‘అశోక చక్రను ప్రదానం చేసింది. కేవలం ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన రుక్మిణి వసంత్, తండ్రి జ్ఞాపకాలను మర్చిపోలేదు. ప్రతి సంవత్సరం తండ్రి జయంతి, వర్ధంతి రోజున ఆయనను స్మరించుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత పోస్టులు చేస్తూ ఉంటారు. రుక్మిణి తల్లి సుభాషిణి, ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి. భర్త మరణం తర్వాత ‘వీర్ రత్న ఫౌండేషన్’ అనే సంస్థను స్థాపించి, తనలాంటి సైనికుల భార్యలకు మద్దతుగా నిలబడుతున్నారు. రుక్మిణి కూడా భరతనాట్యం నేర్చుకుని తన తల్లి డాన్స్ ట్రూప్‌తో కలిసి ప్రదర్శనలు ఇచ్చింది. ముఖ్యంగా.. లయ, భావ ప్రదర్శనలో రుక్మిణి సాధించిన ప్రావీణ్యం..ఆమెను గొప్ప నర్తకిగా నిలిపాయి. రుక్మిణి లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్‌లో నటనలో శిక్షణ పొందింది. సాహిత్యం, కవిత్వాల పట్ల తనకున్న మక్కువను తరచూ ఇన్‌స్టా పోస్టుల్లో ప్రదర్శిస్తూ ఉంటుంది. నటిగా ఎదగడానికి తోడ్పడిన అంశాల్లో పుస్తకపఠనం ఒకటని రుక్మిణి చెబుతూ ఉంటుంది. మాతృభాష కన్నడతో పాటు, ఇంగ్లీషు, హిందీ, తమిళం భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న రుక్మిణి వసంత్, కేవలం అందంతోనే కాకుండా తన నటనతోనూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంతో పాటు, యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీవారి క్యాలెండర్లు రెడీ.. ఈసారి ఆన్‌లైన్‌లోనూ డెలివరీ
లేటుగా వచ్చారా.. రంగు డబ్బా కొనుక్కురండి విద్యార్ధులకు ప్రిన్సిపాల్ వింత పనిష్మెంట్
ఫోన్‌పే కొత్త ఆవిష్కరణ ‘స్మార్ట్ పాడ్’తో చెల్లింపులు మరింత ఈజీ!
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

