దారుణం.. బంగారం కోసం పుర్రెను ఎత్తుకెళ్లిన దొంగలు
మనుషులు రానురానూ విచక్షణ కోల్పోతున్నారా అనిపిస్తోంది. బంధాలు, నమ్మకాలు, భావోద్వేగాలు విలువలేకుండా పోతోంది. ఈజీ మనీకి అలవాటుపడి దొంగతనాలకు పాల్పడటమే కాదు.. ఆ దొంగతనాలు ఒక్కోసారి గతి తప్పి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. ఒంటిమీద బంగారం కోసం అంత్యక్రియలు జరిగిన తర్వాత వృద్ధురాలి కపాలాన్ని ఎత్తుకెళ్లారు దుండగులు.
కేవలం తులం బంగారం కోసం దొంగలు దారుణానికి పాల్పడ్డారు. అంత్యక్రియలు చేసిన వృద్ధురాలి కపాలం, ఎముకలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో చోటుచేసుకుంది. ఛాబాబాయి పాటిల్ అనే వృద్ధురాలు అక్టోబరు 5వ తేదీన మరణించారు. మర్నాడు సోమవారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె చివరి కోరిక మేరకు ఒంటిపై ఉన్న తులం బంగారాన్ని కుటుంబ సభ్యులు అలాగే ఉంచారు. మంగళవారం ఆమె అస్థికలను తీసుకొచ్చేందుకు బంధువులు వెళ్లగా.. కపాలం, ఎముకలు కనిపించలేదు. బంగారం కోసం దొంగలు వాటిని ఎత్తుకెళ్లారని గుర్తించారు. ఈ ఘటన పట్టణంలో తీవ్ర అలజడి రేపింది. భద్రత విషయంలో మున్సిపాలిటీ తీరుపై వృద్ధురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యశస్వి జైస్వాల్ సంచలనం.. కోహ్లి, గంగూలీ రికార్డులు బ్రేక్
27 సిక్సర్లు, 30 ఫోర్లతో 344 రన్స్.. ఉతికి ఆరేయటం అంటే ఇదే మరి..
బాబోయ్.. ఈ మూవీలో ఎన్ని ట్విస్టులో.. ప్రతి సీన్ క్లైమాక్స్
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్కే కుచ్చు టోపీ పెట్టారుగా
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు

