22 ఏళ్ల తర్వాత.. మనసులో మాట బయటపెట్టిన నయన్
లేడీ సూపర్‌స్టార్ నయనతార సినీ ప్రవేశం చేసి 22 సంవత్సరాలు పూర్తయింది. ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక భావోద్వేగభరిత పోస్ట్ వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు అభినందనలు వస్తున్నాయి. తొలిసారి కెమెరా ముందుకు వచ్చి 22 ఏళ్లు గడిచిందని నయనతార తన పోస్టులో తెలిపింది.
అనుకోకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాననీ సినిమాలే తన ప్రపంచం అవుతాయని అస్సలు ఊహించలేదనీ కానీ ఇక్కడి ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ తనను నిలబెట్టాయని, ధైర్యాన్ని ఇచ్చాయనీ రాసుకొచ్చింది. తనను తానేంటో తెలుసుకునేలా చేసాయనీ తెలిపింది. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పింది. తెలుగులో ‘చంద్రముఖి’ సినిమాతో పరిచయమైన నయనతార, అతి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, ఎన్టీఆర్ తో కలిసి నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. గతేడాది షారుక్ ఖాన్ సరసన ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోనూ భారీ విజయాన్ని అందుకుని తన మార్కెట్‌ను పాన్ ఇండియా స్థాయికి విస్తరించుకుంది. ప్రస్తుతం నయనతార మెగాస్టార్ చిరంజీవి సరసన అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తోంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌ను 2026 సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘మీసాల పిల్లా’ పాట సోషల్ మీడియాలో, రీల్స్‌లో ట్రెండింగ్ అయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏం తమ్ముళ్లూ.. ఎలా ఉన్నారు ?? చంద్రబాబు పేరుతో ఫేక్ వీడియో కాల్
రోడ్డు పైకి బాతుల గుంపు.. భారీగా ట్రాఫిక్ జామ్.. వీడియో వైరల్
జపాన్.. త్వరలో లాక్ డౌన్ !! ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
అఖండ 2 ప్రమోషన్ ప్లాన్ ఏంటి..? బాలయ్య రంగంలోకి దిగేదెప్పుడు?
Pawan Kalyan: పవర్ స్టార్ ప్లాన్ మార్చారా.. వరుస సినిమాలతో బిజీ కానున్నారా ??
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

