ఏం తమ్ముళ్లూ.. ఎలా ఉన్నారు ?? చంద్రబాబు పేరుతో ఫేక్ వీడియో కాల్
టెక్నాలజీతో పాటే… సైబర్ నేరగాళ్లూ అప్‌డేట్ అవుతున్నారు. ఎన్నిరకాలుగా చెక్ పెడుతున్నా వాళ్లు ఎత్తులకు... పై ఎత్తులు వస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వారు నయా మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా, ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా.. వీడియో కాల్ చేసినట్లుగా నమ్మించి.. డబ్బులు లాగే ప్రయత్నం చేసింది ముఠా.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు టీడీపీ నాయకులకు దేవినేని ఉమ పీఏ పేరుతో ఫోన్ చేసి, సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు దుండగుడు. కాసేపటికి దేవినేని ఉమను పోలిన ఓ వ్యక్తి వీడియో కాల్ చేసి, టీడీపీ కార్యకర్తల పిల్లల చదువుకు సహాయం చేయాలని, మూడు ఫోన్ పే నంబర్లకు డబ్బు పంపాలని చెప్పారు. దీంతో 35 వేలు డబ్బును సదరు టీడీపీ నాయకుడు పంపాడు. మరికొన్ని రోజులకు మళ్లీ తిరిగి ఫోన్ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని, కాసేపట్లో చంద్రబాబు వీడియో కాల్ చేస్తాడని తెలిపాడు ఆ కేటుగాడు. అయితే.. అతడు చెప్పినట్టుగానే కాసేపటికి చంద్రబాబు మొహంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేయడంతో టీడీపీ నేత.. నిజంగానే బాబుగారే ఫోన్ చేశాడని నమ్మాడు. కాసేపటికి ఫోన్ చేసి విజయవాడకు వస్తే చంద్రబాబును కల్పించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీ ఫాం ఇప్పిస్తానని చెప్పడంతో 18 మంది టీడీపీ నాయకులు విజయవాడకు వెళ్లారు. హోటల్ బిల్లు కూడా తామే చెల్లిస్తామని చెప్పడంతో విజయవాడలోని ఒక హోటల్లో బస చేసేందుకు వెళ్లారు నాయకులు. సాయంత్రం తిరిగి ఫోన్ చేసి చంద్రబాబును కలిసేందుకు 8 మందికి మాత్రమే అనుమతి ఉందని, ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించాలని దుండగుడు కోరారు. ఈ క్రమంలో ఫుడ్ బిల్లు చెల్లించాలని అడిగిన హోటల్ సిబ్బందితో టీడీపీ నాయకులు గొడవకు దిగగా పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో అసలు విషయం బయపటడింది. వెంటనే సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డు పైకి బాతుల గుంపు.. భారీగా ట్రాఫిక్ జామ్.. వీడియో వైరల్
జపాన్.. త్వరలో లాక్ డౌన్ !! ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
అఖండ 2 ప్రమోషన్ ప్లాన్ ఏంటి..? బాలయ్య రంగంలోకి దిగేదెప్పుడు?
Pawan Kalyan: పవర్ స్టార్ ప్లాన్ మార్చారా.. వరుస సినిమాలతో బిజీ కానున్నారా ??
గేరు మార్చిన టాప్ కెప్టెన్స్.. చిత్రాలను వేగంగా పూర్తి చేస్తున్న దర్శకులు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

