యశస్వి జైస్వాల్ సంచలనం.. కోహ్లి, గంగూలీ రికార్డులు బ్రేక్
భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మరోసారి అద్భుతం చేశాడు. ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో అతను ఒకే దెబ్బకు రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా, అత్యంత వేగంగా 3000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన భారత క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించాడు.
వెస్టిండీస్‌తో ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ గొప్పగా ఆటను ప్రారంభించారు. రాహుల్ 38 పరుగుల వద్ద స్టంప్ అవుట్ అయినా, జైస్వాల్ ఆ తర్వాత వచ్చిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌తో కలిసి అద్భుతంగా ఆడాడు. వీరిద్దరూ కలిసి 55 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 150 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇన్నింగ్స్‌లోని 51వ ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసి జైస్వాల్ తన 7వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత అతను చేతి వేళ్లతో లవ్ సింబల్ చూపిన సీన్.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. యశస్వి జైస్వాల్ కేవలం 71 ఇన్నింగ్స్‌లలో ఈ మార్క్‌ను చేరుకోవడం ద్వారా అతను అరుదైన రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా 3000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్లలో జైస్వాల్ ఇప్పుడు సునీల్ గవాస్కర్ తర్వాత రెండవ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అతను సౌరవ్ గంగూలీ 74 ఇన్నింగ్స్‌లు, విరాట్ కోహ్లీ 80 ఇన్నింగ్స్‌లు వంటి దిగ్గజాల రికార్డులను ఒకే దెబ్బకు బద్దలు కొట్టాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
27 సిక్సర్లు, 30 ఫోర్లతో 344 రన్స్.. ఉతికి ఆరేయటం అంటే ఇదే మరి..
బాబోయ్.. ఈ మూవీలో ఎన్ని ట్విస్టులో.. ప్రతి సీన్ క్లైమాక్స్
TOP 9 ET News: ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి సాంగ్ వీడియో లీక్..
22 ఏళ్ల తర్వాత.. మనసులో మాట బయటపెట్టిన నయన్
ఏం తమ్ముళ్లూ.. ఎలా ఉన్నారు ?? చంద్రబాబు పేరుతో ఫేక్ వీడియో కాల్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

