ఫోన్‌పే కొత్త ఆవిష్కరణ ‘స్మార్ట్ పాడ్’తో చెల్లింపులు మరింత ఈజీ!
ఫోన్‌పే మరో కొత్త ఆవిష్కరణకు తెరతీసింది. చిన్న, మధ్యతరహా వ్యాపారుల కోసం ఫోన్ పే స్మార్ట్ పాడ్ పేరుతో డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. యూపీఐ సౌండ్‌బాక్స్‌తో పాటు కార్డు చెల్లింపులను కూడా స్వీకరించేలా ఒకే పరికరంలో రెండు సదుపాయాలను అందిస్తూ ‘ఫోన్‌పే స్మార్ట్‌పాడ్’ను ఆవిష్కరించింది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025 వేదికగా ఈ సరికొత్త హైబ్రిడ్ డివైజ్‌ను కంపెనీ పరిచయం చేసింది.
ప్రస్తుతం చాలామంది వ్యాపారులు యూపీఐ చెల్లింపుల కోసం స్మార్ట్‌స్పీకర్లను వాడుతున్నారు. అయితే, కార్డు ద్వారా చెల్లించాలనుకునే కస్టమర్లు వచ్చినప్పుడు, పీఓఎస్ మెషిన్ లేకపోవడంతో వ్యాపారాన్ని కోల్పోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఫోన్‌పే ఈ స్మార్ట్‌పాడ్‌ను రూపొందించింది. ఇది స్మార్ట్‌స్పీకర్, పాయింట్ ఆఫ్ సేల్ (POS) పరికరాల కలయికగా పనిచేస్తుంది. తద్వారా వ్యాపారులు తక్కువ ఖర్చుతోనే అన్ని రకాల డిజిటల్ చెల్లింపులను సులభంగా స్వీకరించే అవకాశం ఉంటుంది. పూర్తిగా భారత్‌లోనే తయారైన ఈ పరికరం, వ్యాపారుల అవసరాలకు తగ్గట్టుగా రూపొందినట్టు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌పాడ్ మాస్టర్‌కార్డ్, వీసా, రూపే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి అన్ని ప్రధాన నెట్‌వర్క్‌లకు చెందిన కార్డులను అంగీకరిస్తుంది. NFC, EMV చిప్ కార్డులతో చెల్లింపులు చేయవచ్చు. ఇందులో కస్టమర్లకు కనిపించేలా ఒక డిస్‌ప్లే, వ్యాపారి కోసం మరో డిస్‌ప్లే ఉంటుంది. పిన్ ఎంటర్ చేయడానికి కీప్యాడ్, లావాదేవీల కోసం ఈ-రసీదుల వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. పాత స్మార్ట్‌స్పీకర్లు క్యూఆర్ కోడ్ చెల్లింపులను సులభతరం చేస్తే, ఈ స్మార్ట్‌పాడ్ ఒక అడుగు ముందుకేసి కార్డు చెల్లింపులను కూడా సాధ్యం చేస్తుంది అని ఫోన్ పే సంస్థ చెబుతోంది. తక్కువ ఖర్చుతో అన్ని రకాల డిజిటల్ పేమెంట్స్‌ను స్వీకరించాలనుకునే చిన్న వ్యాపారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. దీనివల్ల వినియోగదారులు తమకు దగ్గర్లోని చిన్న దుకాణాల్లో కూడా కార్డులను వాడగలుగుతారంది. స్మార్ట్‌స్పీకర్ 2.0లోని సెలబ్రిటీ వాయిస్ కన్ఫర్మేషన్, 4జీ నెట్‌వర్క్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో కూడా కొనసాగిస్తామంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం.. బంగారం కోసం పుర్రెను ఎత్తుకెళ్లిన దొంగలు
యశస్వి జైస్వాల్ సంచలనం.. కోహ్లి, గంగూలీ రికార్డులు బ్రేక్
27 సిక్సర్లు, 30 ఫోర్లతో 344 రన్స్.. ఉతికి ఆరేయటం అంటే ఇదే మరి..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

