Mukesh Ambani: దేశీయ కుబేరుడిగా మళ్లీ అంబానీ.. జాబితాలో ఆరుగురు తెలుగోళ్లు
దేశంలోనే అత్యంత ధనవంతుడిగా మరోసారి ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాది దేశంలోని అత్యంత ధనవంతుల సంపద గణనీయంగా తగ్గినప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మాత్రం మరోసారి భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. తాజాగా అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన భారత 100 మంది అత్యంత ధనవంతుల జాబితా-2025 ఈ వివరాలను వెల్లడించింది.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ముఖేశ్ అంబానీ 105 బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఆయన ఆస్తి 12 శాతం తగ్గినప్పటికీ, దేశంలో 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో ఉన్న ఏకైక వ్యక్తి గా నిలిచారు. ఇక అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 92 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి జిందాల్ కుటుంబం 40.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలవడమే కాకుండా.. ధనవంతుల్లో టాప్-10లో ఉన్న ఏకైక మహిళగా ఆమె నిలిచారు. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో ఆరుగురు తెలుగు పారిశ్రామికవేత్తలు స్థానం సంపాదించడం గమనార్హం. వీరిలో దివీస్ ల్యాబొరేటరీస్ అధిపతి మురళి దివి, రూ. 88,800 కోట్ల సంపదతో జాతీయ స్థాయిలో 25వ ర్యాంకులో నిలిచి, తెలుగువారిలో అగ్రస్థానాన్ని సంపాదించారు. మేఘా ఇంజనీరింగ్ అధినేతలు పీపీ రెడ్డి, పీవీ కృష్ణా రెడ్డి 70వ ర్యాంకు, జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున రావు 83వ ర్యాంకు, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి.రెడ్డి 86వ ర్యాంకు, హెటిరో గ్రూప్ చైర్మన్ బి.పార్థసారధి రెడ్డి 89వ ర్యాంకు, డాక్టర్ రెడ్డీస్ కుటుంబానికి చెందిన కె. సతీశ్ రెడ్డి 91వ ర్యాంకుతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వారి ఖాతాల్లో లక్ష చొప్పున జమ.. రికవరీకి అధికారుల తంటాలు
మాజీ ఎమ్మెల్యే పేరుతో మాయలేడి అరాచకం
భారీ క్రేన్‌తో సహాయంతో ఆస్పత్రికి వ్యక్తి తరలింపు !! ఎందుకిలా చేశారో తెలుసా ??
NRI Marriages: అమెరికా పెళ్లి సంబంధాలపై తగ్గుతున్న మోజు
ఆ రెండు దగ్గు సిరప్‌లు బ్యాన్‌రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి

