వారి ఖాతాల్లో లక్ష చొప్పున జమ.. రికవరీకి అధికారుల తంటాలు
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నగదు జమలో గందరగోళం జరిగింది. కొందరు లబ్ధిదారుల ఖాతాల్లో అదనంగా రూ.లక్ష జమ అయినట్టు తెలుస్తోంది. మొత్తం 1,266 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.12.66 కోట్లు జమ చేశారు అధికారులు. విశ్వసనీయ సమాచారం ప్రకారం దసరా పండగకు ముందు వివిధ దశలను పూర్తి చేసుకున్న పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమచేశారు.
ఈ క్రమంలో కొందరి ఖాతాల్లో అదనంగా రూ.లక్ష చొప్పున జమ అయ్యాయి. అనంతరం విషయాన్ని గుర్తించిన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నగదు రికవరీ కోసం నానా తంటాలు పడుతున్నట్టు సమాచారం. భద్రాద్రి జిల్లాలో 157 మందికి..రంగారెడ్డిలో 119, నిజామాబాద్‌లో 91 మందికి నగదు జమ అయినట్టు తెలుస్తోంది. కాగా, కొంతమంది నుంచి అధికారులు ఇప్పటికే నగదు రాబట్టినట్టు సమాచారం. మరోవైపు అదనంగా జమ అయిన డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంకర్లకు కూడా గృహనిర్మాణ శాఖ లేఖ రాసినట్లు సమాచారం. పలువురి ఖాతాల్లో రూ.లక్ష చొప్పున అదనంగా జమ అయిన మాట నిజమేనని.. సాంకేతిక లోపంతో పొరపాటు జరిగిందని, రికవరీ చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాజీ ఎమ్మెల్యే పేరుతో మాయలేడి అరాచకం
భారీ క్రేన్‌తో సహాయంతో ఆస్పత్రికి వ్యక్తి తరలింపు !! ఎందుకిలా చేశారో తెలుసా ??
NRI Marriages: అమెరికా పెళ్లి సంబంధాలపై తగ్గుతున్న మోజు
ఆ రెండు దగ్గు సిరప్‌లు బ్యాన్‌రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

