మాజీ ఎమ్మెల్యే పేరుతో మాయలేడి అరాచకం
ఒకటి కాదు రెండు కాదు.. మాయమాటలు చెప్పి ఏకంగా 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఓ కిలాడీ లేడి. మా డబ్బులు మాకు ఇవ్వమని బాధితులు డిమాండ్ చేయడంతో.. వారిపై తన మనుషులతో దారుణంగా దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పటాన్‌చెరులో ఊహించని మోసం వెలుగు చూసింది. ఏపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పి.. విద్య అనే మహిళ అనేక మంది మహిళలను మోసం చేసింది.
తక్కువ ధరకు బంగారం, ఇచ్చిన డబ్బుకు రెట్టింపు మొత్తం ఇస్తానంటూ వారికి మాయమాటలు చెప్పి దాదాపు రూ. 18 కోట్ల వరకు వసూలు చేసింది. ఓ మాజీ ఎమ్మెల్యే నుంచి తనకు దాదాపు 2 వేల కోట్ల రూపాయలు వస్తున్నాయని.. కంటైనర్లు కొనేందుకు డబ్బులు కావాలని వారిని నమ్మించింది. వారాసిగూడలో ఉన్నప్పుడు ఈ మోసాలకు పాల్పడిన విద్య.. ఆ తరువాత తన మకాంను పటాన్ చెరుకు మార్చింది. బాధితులు బంగారం, డబ్బు గురించి నిలదీస్తే.. రేపుమాపు అంటూ తప్పించుకుంటూ వచ్చింది. ఏడాదిన్నరగా పటాన్‌చెరులో ఇదే తంతు నిర్వహిస్తోన్న మహిళ తీరుపై అనుమానం వచ్చిన డబ్బులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో గురువారం వారిని పటాన్‌చెరులోని తన నివాసానికి పిలిపించి భర్త అనుచరులతో దాడి చేయించింది.విద్య, ఆమె భర్త అనుచరులు చేసిన దాడిలో పలువురు మహిళలు గాయపడ్డారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలు కావటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలంటూ పటాన్ చెరు పోలీసులను ఆశ్రయించారు బాధితులు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీ క్రేన్‌తో సహాయంతో ఆస్పత్రికి వ్యక్తి తరలింపు !! ఎందుకిలా చేశారో తెలుసా ??
NRI Marriages: అమెరికా పెళ్లి సంబంధాలపై తగ్గుతున్న మోజు
ఆ రెండు దగ్గు సిరప్‌లు బ్యాన్‌రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దు
వీధి కుక్కల్ని ఇంటికి తెచ్చిన భార్య .. విడాకులు కోరిన భర్త వీడియో
ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా?ఫోన్ పేలుద్ది జాగ్రత్త వీడియో
అర్ధరాత్రి కారు బీభత్సం..దగ్గరకు వెళ్లి చూడగా వీడియో
సారూ.. కాస్త ‘వైఫ్’ని వెతికి పెట్టరూ..? వీడియో
రూ.1.5 కోట్ల ఫ్లాట్.. పెన్సిల్‌తో గోడకు రంధ్రం ? వీడియో
ఆకాశం అంచులు తాకిన మోనో రైలు వీడియో
నడిరోడ్డుమీద భార్యను నరికి చంపాడు..కారణం ఇదే వీడియో

