శ్రీవారి క్యాలెండర్లు రెడీ.. ఈసారి ఆన్‌లైన్‌లోనూ డెలివరీ
2026 సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను విడుదల చేసింది. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఎంపిక చేసిన ప్రాంతాల్లో, టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. నూతన సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని దేవస్థానం పరిపాలనా భవనాల ఎదురుగా ఉన్న సేల్స్ కౌంటర్, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలోని ధ్యాన మందిరం, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాలు, తిరుచానూరులో ఉన్న తితిదే పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
తిరుమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో కూడా ఇవి అందుబాటులో ఉండనున్నట్టు టీడీడీ పేర్కొంది. తిరుమల, తిరుపతిలోనే కాకుండా విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది. ఇక బెంగళూరు, దిల్లీ, ముంబయి, వేలూరు, రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని టీటీడీ కల్యాణ మండపాల్లో 2026 సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇవేగాకుండా దేవస్థానం వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే తపాలా శాఖ ద్వారా డైరీలు, క్యాలెండర్లను పొందే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ అవకాశం గతంలో మాదిరిగానే కొనసాగుతుందని www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లేటుగా వచ్చారా.. రంగు డబ్బా కొనుక్కురండి విద్యార్ధులకు ప్రిన్సిపాల్ వింత పనిష్మెంట్
ఫోన్‌పే కొత్త ఆవిష్కరణ ‘స్మార్ట్ పాడ్’తో చెల్లింపులు మరింత ఈజీ!
దారుణం.. బంగారం కోసం పుర్రెను ఎత్తుకెళ్లిన దొంగలు
యశస్వి జైస్వాల్ సంచలనం.. కోహ్లి, గంగూలీ రికార్డులు బ్రేక్
27 సిక్సర్లు, 30 ఫోర్లతో 344 రన్స్.. ఉతికి ఆరేయటం అంటే ఇదే మరి..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

