లేటుగా వచ్చారా.. రంగు డబ్బా కొనుక్కురండి విద్యార్ధులకు ప్రిన్సిపాల్ వింత పనిష్మెంట్
వేములవాడ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో విచిత్ర సంఘటన జరిగింది. స్కూలుకి ఆలస్యంగా వచ్చిన విద్యార్ధులకు వింత పనిష్మెంట్ ఇచ్చారు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు. లేటుగా వచ్చే విద్యార్ధులు స్కూలుకి ఎదురుగా ఉన్న ఓ దుకాణంలో రంగు డబ్బా కొని తీసుకొచ్చి స్కూల్లో అప్పగించాలి. ఈ వింత పనిష్మెంట్‌కి తల్లిదండ్రులతోపాటు, స్థానికులు ఆశ్చర్యపోయారు.
దసరా, బతుకమ్మ సెలవులు ముగిసిన తరువాత విద్యార్థులు పాఠశాలకు తిరిగి వచ్చారు. కొంతమంది విద్యార్థులు కాస్త ఆలస్యంగా మంగళవారం స్కూల్‌కి వచ్చారు. ఈ విషయం ప్రిన్సిపల్ దృష్టికి వెళ్లగానే, “లేటుగా వచ్చిన ప్రతి ఒక్కరూ పాఠశాల ఎదుట ఉన్న షాపులో కలర్ డబ్బా కొనుక్కొని వస్తేనే లోపలికి ప్రవేశం ఉంటుంది అని ఆదేశించినట్టు సమాచారం. విద్యార్థులు అయోమయంలో పడగా, తల్లిదండ్రులు ఈ వింత ఆదేశం ఏంట్రా బాబూ అని ఆశ్చర్యపోయారు. పిల్లలకి పాఠాలు బోధించాల్సిన గురువులు ఇలాంటి పనిష్మెంట్‌లు ఇస్తే ఎలా?” అని ప్రశ్నించారు. కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రుల సహాయంతో కలర్ డబ్బాలు కొనుక్కొచ్చి స్కూల్‌లోకి ప్రవేశించారు. ఇదే సమయంలో, పాఠశాల ఎదుట ఉన్న షాపులో ఒక్కసారిగా కలర్ డబ్బాల డిమాండ్ పెరగడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే స్థానిక విద్యార్థి సంఘలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోన్‌పే కొత్త ఆవిష్కరణ ‘స్మార్ట్ పాడ్’తో చెల్లింపులు మరింత ఈజీ!
దారుణం.. బంగారం కోసం పుర్రెను ఎత్తుకెళ్లిన దొంగలు
యశస్వి జైస్వాల్ సంచలనం.. కోహ్లి, గంగూలీ రికార్డులు బ్రేక్
27 సిక్సర్లు, 30 ఫోర్లతో 344 రన్స్.. ఉతికి ఆరేయటం అంటే ఇదే మరి..
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

