AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్డ్ లోన్ తీసుకున్నారా ?? ఇది మీ కోసమే

గోల్డ్ లోన్ తీసుకున్నారా ?? ఇది మీ కోసమే

Phani CH
|

Updated on: Oct 11, 2025 | 3:59 PM

Share

ఈ రోజుల్లో బంగారంపై రుణాలు తీసుకోవడం సామాన్య ప్రజలకు అత్యంత సులభంగా మారింది. బంగారం రేటు రోజు రోజుకూ పెరుగుతుండటంతో రుణాలు తీసుకునేవారి సంఖ్యకూడా పెరుగుతోంది. ఇతర రుణాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, ఇంకా పలు ఇతర కారణాలతో గోల్డ్‌పై రుణాలు తీసుకునేందుకు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు.

మిగతా రుణాలతో పోల్చితే.. బంగారు రుణాలపై వడ్డీ కూడా తక్కువ కావటంతో జనాలు ఈ రుణాలపై ఆసక్తి చూపుతున్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనే మనదేశంలో బంగారు రుణాలు తీసుకునే వారి సంఖ్య ఏకంగా 26 శాతానికి పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర మరింతగా పెరుగుతున్న వేళ.. రాబోయే రోజుల్లో పుత్తడి రుణాలు మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకులు కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి. బంగారం ధర ఆకాశాన్ని అంటుతుండటంతో.. రుణాలు పెరుగుతున్న వేళ.. బంగారు రుణాల రికవరీ బ్యాంకులకు కష్టంగా మారుతోంది. ఇటీవలి కాలంలో.. బంగారంపై రుణాలు తీసుకున్నవారు నిర్ణీత సమయంలో చెల్లించటం లేదు. మొత్తం రుణ గ్రహీతల్లో ఏకంగా 30 శాతం మంది ఎగవేతదారుల జాబితాలోకి ఎక్కుతున్నారు. దీంతో, బంగారు రుణాలకు నెలనెలా వడ్డీ వసూలు చేయాలని బ్యాంకుల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. అనుకున్న టైంకి.. ప్రతినెలా వడ్డీ కట్టకపోతే ఖాతాదారుల సిబిల్‌ స్కోర్‌పై ప్రభావం పడి క్రెడిట్‌ వ్యాల్యు పడిపోతుందని బ్యాంకులు.. బంగారు రుణాలు తీసుకున్న వారిని హెచ్చరిస్తున్నాయి. లోన్ కట్టలేక చేతులెత్తేసిన వారికి .. సిబిల్‌ స్కోర్‌ తగ్గి… తర్వాతి రోజుల్లో కొత్త రుణం పుట్టటం కష్టమని వారు గుర్తుచేస్తున్నారు. అయితే, ఖాతాదారు ఆర్థిక స్థాయిని పరిశీలించి ఈ ఆంక్షలు విధిస్తున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. బంగారంపై రుణం తీసుకున్న ఏడాదిలోగా బాకీ పూర్తిగా తిరిగి చెల్లించి మళ్లీ కొత్త రుణం తీసుకోవాలనే నిబంధన ఉంది. గోల్డ్‌ విలువ ఆధారంగా ఎంత రుణం ఇవ్వాలనే అంశంపైనా ఆర్బీఐ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. బంగారం పెట్టి రూ.2.50 లక్షల లోపు రుణం తీసుకునే వారికి బంగారం విలువలో 85 శాతం, రూ.5 లక్షలలోపు రుణమైతే.. 80 శాతం, అంతకుమించితే 75 శాతమే ఇవ్వాలని నిబంధనలున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు ఈ నిబంధనల ప్రకారం రుణం ఇస్తున్నా, ప్రైవేటు ఆర్థిక సంస్థలు అంతకుమించి ఇస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కేబినెట్ ఆమోదం

చెరువు గట్టుపై భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు

Mukesh Ambani: దేశీయ కుబేరుడిగా మళ్లీ అంబానీ.. జాబితాలో ఆరుగురు తెలుగోళ్లు

వారి ఖాతాల్లో లక్ష చొప్పున జమ.. రికవరీకి అధికారుల తంటాలు

మాజీ ఎమ్మెల్యే పేరుతో మాయలేడి అరాచకం