కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కేబినెట్ ఆమోదం
మహిళల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం కర్ణాటక క్యాబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగినులకు నెలలో ఒక రోజు వేతనంతో కూడిన నెలసరి సెలవు తప్పనిసరి చేసింది. సిద్ధరామయ్య సర్కారు నిర్ణయంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇది మహిళా ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని, పని వాతావరణాన్ని మెరుగుపరుస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ కొత్త విధానం ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలతో పాటు టెక్స్‌టైల్, ఐటీ, బహుళజాతి కంపెనీలు సహా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు సంస్థల్లోని మహిళా సిబ్బందికి వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మహిళలకోసం ప్రోత్సాహకరమైన పని వాతావరణాన్ని సృష్టించడమే తమ లక్ష్యమని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం ఎంతో మంది మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటికే బిహార్, కేరళ, ఒడిశా, సిక్కిం వంటి రాష్ట్రాలు మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో కర్ణాటక కూడా చేరింది. ప్రభుత్వాలే కాకుండా, జొమాటో, స్విగ్గీ, ఎల్ అండ్ టీ వంటి కొన్ని ప్రైవేటు సంస్థలు సైతం ఇప్పటికే తమ మహిళా ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెరువు గట్టుపై భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు
Mukesh Ambani: దేశీయ కుబేరుడిగా మళ్లీ అంబానీ.. జాబితాలో ఆరుగురు తెలుగోళ్లు
వారి ఖాతాల్లో లక్ష చొప్పున జమ.. రికవరీకి అధికారుల తంటాలు
మాజీ ఎమ్మెల్యే పేరుతో మాయలేడి అరాచకం
భారీ క్రేన్‌తో సహాయంతో ఆస్పత్రికి వ్యక్తి తరలింపు !! ఎందుకిలా చేశారో తెలుసా ??
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

