AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బామ్మర్ది పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ సందడే సందడి వీడియో

బామ్మర్ది పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ సందడే సందడి వీడియో

Samatha J
|

Updated on: Oct 12, 2025 | 12:01 PM

Share

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, శివాని వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్, భార్గవ్‌లతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్, శివానిల వివాహం శుక్రవారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లిలో అత్యంత వైభవంగా జరిగింది. సినీ ప్రముఖులు, ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక కనుల పండువగా సాగింది. గత ఏడాది శివానితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నార్నే నితిన్, ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి సందడి చేశారు. భార్య లక్ష్మీ ప్రణతితో పాటు కుమారులు అభయ్, భార్గవ్‌లతో కలిసి తారక్ హాజరయ్యారు. వేడుకలో ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం :

గర్ల్స్‌ టాయిలెట్‌లో హిడెన్‌ కెమెరా కలకలం వీడియో

రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో

30 ఏళ్లనాటి ఆ కాగితాలే.. కోటీశ్వరుణ్ణి చేశాయి వీడియో