వేములవాడలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు వింత శిక్ష విధించారు. పాఠశాలకు ఎదురుగా ఉన్న దుకాణంలో రంగు డబ్బా కొనుక్కుని వస్తేనే లోపలికి అనుమతిస్తామని ఆదేశించారు. ఈ వింత ఆదేశంపై తల్లిదండ్రులు, స్థానికులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.