చిత్తూరులోని అపోలో యూనివర్సిటీ గర్ల్స్ టాయిలెట్లో హిడెన్ కెమెరా కలకలం రేపింది. హరి నారాయణ కన్స్ట్రక్షన్స్ సైట్ ఇంజనీర్ రూబెన్ను నిందితుడిగా గుర్తించారు. యూనివర్సిటీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించగా, కెమెరాలో ఎలాంటి దృశ్యాలు రికార్డ్ కాలేదని పోలీసులు నిర్ధారించారు.