AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal: ‘సెన్సార్ బోర్డు సభ్యులకు లంచం ఇచ్చాను’.. హీరో విశాల్ సంచలన కామెంట్స్..

ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీసులో తనకు ఈ పరిస్థితి ఎదురైందని చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే తాను ఎదుర్కొన్న పరిస్థితి గురించి ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. అలాగే తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తుల పేర్లు, అకౌంట్స్ నంబర్స్, ఎంత అమౌంట్ చెల్లించారనే విషయాలను సోషల్ మీడియాలో బయటపెట్టారు విశాల్. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకురావాలని వీడియోలో పేర్కొన్నారు విశాల్.

Vishal: 'సెన్సార్ బోర్డు సభ్యులకు లంచం ఇచ్చాను'.. హీరో విశాల్ సంచలన కామెంట్స్..
Actor Vishal
Rajitha Chanti
|

Updated on: Sep 28, 2023 | 7:25 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల విడుదలైన మార్క్ ఆంటోనీ సినిమా హిందీ వెర్షన్ కోసం సెన్సార్ బోర్డుకు లచ్చం ఇచ్చినట్లు తెలిపారు. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీసులో తనకు ఈ పరిస్థితి ఎదురైందని చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే తాను ఎదుర్కొన్న పరిస్థితి గురించి ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. అలాగే తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తుల పేర్లు, అకౌంట్స్ నంబర్స్, ఎంత అమౌంట్ చెల్లించారనే విషయాలను సోషల్ మీడియాలో బయటపెట్టారు విశాల్. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకురావాలని వీడియోలో పేర్కొన్నారు విశాల్. ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతున్నాయి.

“అవినీతిని వెండితెరపై చూపిస్తున్నారు. కానీ నిజ జీవితంలోనే జరుగుతుంది. దీనిని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో.. ముంబైలోని CBFC ఆఫీసులో (సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ కోసం రూ.6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన 2 లావాదేవీలు చేశాను. ఒకటి స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, అలాగే సర్టిఫికేట్ కోసం రూ.3.5 లక్షలు చెల్లించాను. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఈ రోజు సినిమా విడుదలైనప్పటి నుండి సంబంధిత మధ్యవర్తికి చాలా ఎక్కువ డబ్బు చెల్లించడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయాన్ని గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవప్రదమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకువెళుతున్నాను. ఇలా చేయడం నా కోసం కాదు భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసమే. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి ఇవ్వాల్సిన అవకాశమే లేదు. అందరూ తెలుసుకోవడానికి నా దగ్గర ఉన్న సాక్ష్యాలు పెడుతున్నాను. సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో ఏస్ జే సూర్య, సెల్వ రాఘవన్, సునీల్ కీలకపాత్రలలో నటించారు. ఇందులో రీతూవర్మ కథానాయికగా నటించగా.. మినీ స్టూడియో బ్యానర్ పై వినోద్ కుమార్ నిర్మించారు. సెప్టెంబర్ 15న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.