
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టాడు. కెరీర్ తొలి నాళ్లల్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన విజయ్.. ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. హీరోయిజం చిత్రాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలు సైతం పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అంతుకు ముందు ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇప్పుడు తమిళంలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలో క్యూరియాసిటీ నెలకొంది. ఇది కాకుండా ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ఏస్.
అరుముగ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ సేతుపతి సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 23న ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఏస్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు విజయ్ సేతుపతి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడిగా తాను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణమని.. అతడికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.
విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. “సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు వర్ణం అనే సినిమా ఆడిషన్ కు వెళ్లాను. అక్కడ భూపతి అనే మేనేజర్ నా ఫోటోస్ నిర్మాతలకు ఇచ్చారు. అక్కడ నన్ను పిలిచి సన్నివేశం చెప్పి నన్నే డైలాగ్స్ రాసుకుని నటించాలని చెప్పారు. నేను డైలాగ్స్ రాయగలనని నాకే తెలియదు. కానీ కొన్ని డైలాగ్స్ రాసి దగ్గర్లోని షాప్ లో హెయిర్ జెల్ కొనుగోలు చేసి దాన్ని రాసుకుని నటించి చూపించాను. ఆ తర్వాత నన్ను తీసుకోవాలా వద్దా అని నిర్మాతలు ఆలోచిస్తున్న సమయంలో నేను బాగా నటించానని.. తప్పుకుండా తీసుకోవాలని ఆ సినిమా డైరెక్టర్ ఆరుముగ కుమార్ నిర్మాతలకు చెప్పారు. ఆయన వల్లే నాకు తొలి సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత నడువుల కొంజం పక్కా కనోమ్ సినిమాకు నన్ను తీసుకోవాలని ఆరుముగ సర్ చెప్పారట. ఆ విషయం 96 డైరెక్టర్ ప్రేమ్ ద్వారా తెలిసింది. నటుడిగా సినీరంగంలో తొలి అడుగులు వేస్తున్న సమయంలో ఆరుముగ సర్ నాకు అండగా నిలిచారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను” అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఏస్ సినిమాను ఈనెల 23న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..
Tollywood: రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..