
తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోలలో అతడు ఒకరు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఈ హీరో.. ఎన్నో ప్రేమకథ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఒకటి రెండు చిత్రాలతోనే స్టార్ స్టేటస్ అందుకున్న అతడు.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. స్క్రిప్ట్ ఎంపికలో చేసిన పొరపాట్లతో మొత్తం కెరీర్ పోగొట్టుకున్నాడు. ఫలితంగా సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. దాదాపు 9 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ హీరో.. ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వనున్నాడనే ప్రచారం నడుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.? అతడే వడ్డే నవీన్. తెలుగు సినీరంగంలో ఒకప్పుడు టాప్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. చాలా కాలంగా ఈ హీరో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ కుమారుడిగా సినీరంగంలోకి హీరోగా తెరంగేట్రం చేశారు నవీన్. కోరుకున్న ప్రియుడు సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన ఆయన.. రెండో సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అదే పెళ్లి చిత్రం. ఈ సినిమాతో నవీన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్. ఇందులో మహేశ్వరి కథానాయికగా నటించగా.. పృథ్వీరాజ్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా తర్వాత నవీన్ కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మనసిచ్చి చూడు.. స్నేహితులు , చెప్పాలని ఉంది, చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి సినిమాలతో అలరించారు. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. నవీన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దీంతో ఆయనకు నెమ్మదిగా ఆఫర్స్ తగ్గిపోయాయి.
Vadde Naveen Movies
చివరగా 2016లో ఎటాక్ చిత్రంలో కనిపించిన వడ్డే నవీన్.. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ఇక ఇప్పుడు దాదాపు 9 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజమనేది తెలియరాలేదు. ప్రస్తుతం వడ్డే నవీన్ వ్యాపారరంగంలో బిజీగా ఉన్న్టలు సమాచారం. అయితే ఇప్పుడు వడ్డే క్రియేషన్స్ పేరిట ఆయన ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు తెలుస్తోంది. నటుడిగా కాకుండా నిర్మాతగా ఇండస్ట్రీకి తిరిగి రానున్నట్లు సమాచారం.
Vadde Naveen starts his new production house.@vaddecreations 💥 pic.twitter.com/nufRFthfBw
— Cinema Madness 24*7 (@CinemaMadness24) July 10, 2025
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..