AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Syed Sohel: ‘అప్పుడు అందరూ ఉన్నారు.. ఇప్పుడేమైందన్నా ?’.. చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన సోహైల్..

బూట్ కట్ బాలరాజు. ఇందులో హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. డైరెక్టర్ శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మేఘలేఖ కథానాయికగా నటించింది. సునీల్, ఇంద్రజ, ముక్కు అవినాష్ కీలకపాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని కలిగించిన ఈ మూవీ ఫిబ్రవరి 2న విడుదలైంది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నా.. థియేటర్లలో మాత్రం అసలు జనాలు కనిపించడం లేదు.

Syed Sohel: 'అప్పుడు అందరూ ఉన్నారు.. ఇప్పుడేమైందన్నా ?'.. చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన సోహైల్..
Sohel
Rajitha Chanti
|

Updated on: Feb 03, 2024 | 1:54 PM

Share

బుల్లితెరపై సీరియల్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర్యయాడు సోహైల్. ఆ తర్వాత బిగ్‎బాస్ సీజన్ 4లోకి అడుగుపెట్టి తన ఆట తీరుతో గుర్తింపు తెచ్చుకున్నాడు. టాప్ 5 కంటెస్టెంట్ అయిన సోహైల్.. ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోగా నటించిన సోహైల్.. ఇప్పుడు మరో మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. అదే బూట్ కట్ బాలరాజు. ఇందులో హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. డైరెక్టర్ శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మేఘలేఖ కథానాయికగా నటించింది. సునీల్, ఇంద్రజ, ముక్కు అవినాష్ కీలకపాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని కలిగించిన ఈ మూవీ ఫిబ్రవరి 2న విడుదలైంది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నా.. థియేటర్లలో మాత్రం అసలు జనాలు కనిపించడం లేదు. దీంతో పలు థియేటర్లలో షోను క్యాన్సల్ చేస్తున్నారు. దీంతో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. ఎంతో కష్టపడి ఈ సినిమా రూపొందించామని.. ఫ్యామిలీ అడియన్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అని.. అయినా జనాలు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

“ఎంతో కష్టపడి ఈ సినిమాను తీశాం. ఇందులో ఎలాంటి వల్గారిటీ లేదు. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. నా సినిమాకు రెండు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్ వేశారు. కొన్నిచోట్ల షోస్ పడలేదు. చాలా బాధగా ఉంది. హైదరాబాద్ లో మాత్రం రెస్పాన్స్ చాలా బాగుంది. కానీ మిగిలిన చోట్ల జనాలు థియేటర్లకు వెళ్లడం లేదు . కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తామంటారు కదా.. మాది కంటెంట్ ఉన్న సినిమా. ఒక ముప్పై మంది వెళ్లండి. ఓ నలభై మంది వెళ్లండి. వెళ్లి చూస్తేనే కదా సినిమా ఎలా ఉందో తెలిసేది. సినిమా ఓవైపు జరుగుతుంటే 20 నిమిషాలు చూసి రివ్యూ టైప్ చేస్తున్నాడు. నేను రివ్యూ రాసేవాళ్లను అనడం లేదు. కానీ 20 నిమిషాలు చూసి రివ్యూ రాసేస్తున్నారు.

మనిషి బాధను చెప్పుకున్నప్పుడు అర్థం చేసుకోవాలి. దీన్ని కూడా నెగిటివ్ చెయొద్దు. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అందరూ సోహైల్ అని అన్నారు కదా. ఇప్పుడు ఏమైంది. మీకు దండం పెట్టి అడుగుతున్నా.. థియేటర్ కు వెలఅలి సినిమా చూడండి.. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కామెంట్స్ పెట్టారు. కానీ ఇప్పుడేమైంది ?” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సోహైల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..