Suriya: రామ్ చరణ్ దారిలోనే సూర్య.. లీగ్ క్రికెట్లోకి హీరో.. ఏ టీమ్ అంటే..
ప్రస్తుతం సూర్య లీగ్ క్రికెట్లోకి అడుగుపెట్టారు. స్ట్రీట్ క్రికెట్ లీగ్‌లో చెన్నై జట్టును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని సూర్య స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఇటీవల ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రతి రాష్ట్రంలోని ప్రజలు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, శ్రీనగర్ సహా టీమ్‌లను కొనుగోలు చేసిన నటీనటుల గురించి గతంలో ప్రకటనలు వచ్చాయి.

కోలీవుడ్ హీరో సూర్య కేవలం నటుడిగానే కాకుండా.. ప్రజాసేవ, క్రీడాంశాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నాడు. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సూర్య లీగ్ క్రికెట్లోకి అడుగుపెట్టారు. స్ట్రీట్ క్రికెట్ లీగ్‌లో చెన్నై జట్టును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని సూర్య స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఇటీవల ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రతి రాష్ట్రంలోని ప్రజలు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, శ్రీనగర్ సహా టీమ్‌లను కొనుగోలు చేసిన నటీనటుల గురించి గతంలో ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు చెన్నై టీమ్‌ని కొనుగోలు చేశారు సూర్య.
ఇప్పటివరకు స్టేడియంలో ఆడే అవకాశం రాని క్రికెటర్లకు స్ట్రీట్ క్రికెట్ లీగ్ మంచి వేదిక కానుందని అంటున్నారు. స్ట్రీట్ క్రికెట్ ఆడే అద్భుతమైన పోటీదారుడు అయితే వెంటనే ISPLలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో హైదరాబాద్ టీంను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనుగోలు చేశాడు. అలాగే శ్రీనగర్ టీంను అక్షయ్ కుమార్ కొనుగోలు చేశారు. బెంగళూరు జట్టును హృతిక్ రోషన్ కొనుగోలు చేశారు. ముంబై జట్టును నటుడు అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేశారు. ఇప్పుడు సూర్య చెన్నై టీంను కొనుగోలు చేశారు.
Vanakkam Chennai! I am beyond electrified to announce the ownership of our Team Chennai in ISPLT10. To all the cricket enthusiasts, let’s create a legacy of sportsmanship, resilience, and cricketing excellence together.
Register now at https://t.co/2igPXtyl29!🏏#ISPL @ispl_t10… pic.twitter.com/fHekRfYx0i
— Suriya Sivakumar (@Suriya_offl) December 27, 2023
” ISPLT 10లో మా చెన్నై జట్టు యాజమాన్యాన్ని ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను. క్రికెట్ ఔత్సాహికులందరికీ సరైన క్రీడాస్ఫూర్తి, పోటీతత్వం, క్రికెట్‌లో అత్యుత్తమ టాలెంట్ పెంపొందిద్దాం” అంటూ ట్వీట్ చేశారు సూర్య.
Vanakkam, @Suriya_offl 🤩🙏🏻
A warm welcome to the proud owner of Team Chennai in ISPLT10. We are thrilled to have you onboard! 💫
Want to be a part of Team Chennai? Register at https://t.co/S4QoVw2oZQ 🏏#ISPL #Street2Stadium #TeamChennai https://t.co/2SwuATlko8
— ISPL (@ispl_t10) December 27, 2023
Welcome the Mega Power Star @AlwaysRamCharan as the esteemed owner of Team Hyderabad in ISPLT10 🤩
Registrations are open 👉🏼 https://t.co/S4QoVw2oZQ 🏏#RamCharan #newt10era #street2stadium #ISPL #cinematiccricket pic.twitter.com/UyHw0A58VE
— ISPL (@ispl_t10) December 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
