హైదరాబాద్ లోని ప్రకృతి చికిత్సాలయం (నేచర్ క్యూర్) ఆస్పత్రిని ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ సందర్శించారు. ఈ సందర్భంగా చికిత్సాలయ ఆవరణలో నిర్మాణంలో ఉన్న కాటేజీలు, భోజనశాల, యోగా ప్రాంగణంతో పాటు ఇక్కడ అందుతున్న వైద్యం, డైట్, తదితర వసతులను పరిశీలించారు. అలాగే చికిత్సాలయ ఆవరణలో నెలకొన్న పచ్చదనాన్ని ఆస్వాదించారు. అలాగే వైద్యులు, విద్యార్థులతో కలిసి సంపంగి మొక్కను నాటారు. సోనూసూద్‌తో కలిసి వైద్యులు, విద్యార్థులు సెల్ఫీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ సంకల్పాన్ని సాధించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణ దిశగా ముందుకు తీసుకువెళ్తున్న తీరు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెలే గువ్వల బాలరాజు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆయుష్ కమిషనర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
కాగా ఆపదల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన ఎంతోమందికి ఆపన్న హస్తం అందించారు. ఇప్పటికీ తన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో విలన్‌గా ఆకట్టుకున్నాడు సోనూసూద్. ఆ తర్వాత అక్షయ్ కుమార్ సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం తన తర్వాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు.
“WHAT WE SAVE SAVES US
It’s time to save our planet ??”@SonuSood ❤️sir @apparalaharishk@jagadishsayz @TAnilKu30559805 #sonusood #saveplanet pic.twitter.com/9ekCV4cULr— Poori arts (@Pooriarts2) February 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..