AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రొడ్యూసర్ దగ్గరకి వెళ్తే డబ్బులు రావు అన్నారు.. ఆ సినిమా హిట్ అయ్యుంటే నా రేంజ్ వేరేలా ఉండేది : సత్యదేవ్

చిన్న చిన్న పాత్రల నుంచి ఇప్పుడు హీరోగా ఎదిగాడు ఈ టాలెంటెడ్ యాక్టర్.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఉదాహరణకు వరుణ్ తేజ్ డెబ్యూ మూవీ ముకుంద, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా కొన్ని సినిమాల్లో కనిపించాడు.

ప్రొడ్యూసర్ దగ్గరకి వెళ్తే డబ్బులు రావు అన్నారు.. ఆ సినిమా హిట్ అయ్యుంటే నా రేంజ్ వేరేలా ఉండేది : సత్యదేవ్
Satyadev
Rajeev Rayala
|

Updated on: Nov 20, 2024 | 4:38 PM

Share

టాలీవుడ్ లో యంగ్ హీరోల హవా నడుస్తుంది. కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి హిట్స్ అందుకుంటున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారు యంగ్ హీరోలు. అలాగే ఇంకొంతమంది సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్న అభిమానులను మాత్రం గట్టిగానే సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో సత్యదేవ్ ఒకరు. చిన్న చిన్న పాత్రల నుంచి ఇప్పుడు హీరోగా ఎదిగాడు ఈ టాలెంటెడ్ యాక్టర్.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఉదాహరణకు వరుణ్ తేజ్ డెబ్యూ మూవీ ముకుంద, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా కొన్ని సినిమాల్లో కనిపించాడు. ఆతర్వాత పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు.

బోరాన్.. బోరాన్ ఉంది మావ..! దుల్కర్ సల్మాన్‌తో ఉన్నఈమె ఎవరో తెలుసా..? హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా నిరూపించుకుంటూ దూసుకుపోతున్నాడు సత్యదేవ్. హీరోగానే కాదు ప్రతినాయకుడిగాను మెప్పిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నెగిటివ్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. మెగాస్టార్ సైతం సత్యదేవ్ నటనను మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు జీబ్రా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కూడా డిఫరెంట్ కథతో తెరకెక్కింది. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. అలాగే హాలీవుడ్ మూవీ ముఫాసాలో మహేష్ బాబు మెయిన్ పాత్రకు వాయిస్ ఇవ్వగా.. మహేష్ అపోజిట్ పాత్రకు సత్యదేవ్ వాయిస్ ఇస్తున్నారు.

మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇదిలా ఉంటే తాజాగా సత్యదేవ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఫాసా సినిమాకి మహేష్ అపోజిట్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడం మంచి ఎక్స్ పీరియన్స్ అని సత్యదేవ్ అన్నారు. అలాగే తాను నటించిన బ్లఫ్ మాస్టర్ సినిమా కరెక్ట్ గా హిట్ అయ్యుంటే తన రేంజ్ వేరేలా ఉండేది అని అన్నాడు ఈ యంగ్ హీరో. థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఓటీటీలో యూట్యూబ్ లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన కామెంట్స్ తీసుకుని ప్రొడ్యూసర్ దగ్గరకి వెళ్తే.. వీటితో డబ్బులు రావు కదా అన్నారు అని సత్య దేవ్ తెలిపాడు. కాగా సత్యదేవ్ జీబ్రా సినిమా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సత్య ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us