Rishab Shetty: ‘ప్లీజ్ అలా చేయకండి.. అది మా సెంటిమెంట్’.. రింగ్ టోన్ డౌన్లోడ్ చేయడంపై రిషబ్ శెట్టి రిక్వెస్ట్..

కాంతార చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన వాటిలో వరాహా రూపం సాంగ్ ఒకటి. అలాగే ఈ సినిమాలో దైవం ఆవహించిన సమయంలో వచ్చే ఓ.. శబ్దం ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించిందనడంలో సందేహం లేదు.

Rishab Shetty: ప్లీజ్ అలా చేయకండి.. అది మా సెంటిమెంట్.. రింగ్ టోన్ డౌన్లోడ్ చేయడంపై రిషబ్ శెట్టి రిక్వెస్ట్..
Rishab Shetty, Kantara

Updated on: Dec 11, 2022 | 4:30 PM

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో కాంతార ఒకటి. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై.. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళంలోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సినీ ప్రియులను అలరిస్తోంది. కేవలం ఈ మూవీ మాత్రమే కాకుండా.. ఇందులోని సాంగ్స్ సైతం యూట్యూబ్ లో సెన్సెషన్ క్రి యేట్ చేశారు. ముఖ్యంగా వరాహా రూపం పాటకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. కాంతార చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన వాటిలో వరాహా రూపం సాంగ్ ఒకటి. అలాగే ఈ సినిమాలో దైవం ఆవహించిన సమయంలో వచ్చే ఓ.. శబ్దం ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించిందనడంలో సందేహం లేదు. అయితే సినిమా పూర్తైన అనంతరం ఈ శబ్దాన్ని అనుకరించారు కొందరు. అలాగే ఈ ఏడాది గూగుల్ నుంచి ఎక్కువ మంది డౌన్లోడ్ చేసిన రింగ్ టోన్ కూడా ఇదే కావడం గమనార్హం. తాజాగా ఈ విషయంపై స్పందించారు హీరో రిషబ్ శెట్టి.

ఇటీవల ఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్ తక్ 2022లో పాల్గొన్న రిషబ్ శెట్టి ఓ.. శబ్దం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ శబ్దాన్ని అనుకరించడం.. ఆదివాసీల మనోభావాలు దెబ్బతిసే విధంగా ఈ శబ్దాన్ని ఎగతాళి చేయకండ అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇంటర్నెట్ లో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన ఈ రింగ్ టోన్ గురించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ” ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఓ.. శబ్దం గురించి మాట్లాడుతున్నారు. దీనిని కామెడీగా తీసుకుంటూ అరుస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఎందుకంటే అది మా సెంటి మెంట్. అందులో ఎన్నో భావాలు ఉన్నాయి. ఆ శబ్దాన్ని ఎగతాళి చేసి మా మనోభావాలను దెబ్బతీయకండి ” అంటూ రిక్వెస్ట్ చేశారు .

ఇవి కూడా చదవండి

అలాగే ఇతర భాషల్లోకి ఆ శబ్దాన్ని డబ్ చేయలేదని.. అన్ని భాషల్లోనూ రిషబ్ శెట్టి వాయిస్ ఉన్నట్లు తెలిపారు. అలాగే ఓ.. అనేది కేవలం శబ్దం మాత్రమే కాదని.. అది ఒక ఎమోషన్ అని.. తీర్పు లాంటిందని ప్రజలు నమ్ముతారని .. అందులో ఎన్నో భావోద్వేగాలు.. వైవిధ్యాలు ఉన్నాయని అన్నారు.